National Film Awards 2020: ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’.. ప్రధానంగా ఈ ఐదు కారణాలే…

|

Mar 23, 2021 | 3:55 PM

National Film Awards 2020 Winners List: 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ నుంచి ఉత్తమ

National Film Awards 2020: ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి.. ప్రధానంగా ఈ ఐదు కారణాలే...
Maharshi 7
Follow us on

National Film Awards 2020 Winners List: 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ నుంచి ఉత్తమ తెలుగు చిత్రంగా.. నాని జెర్సీ మూవీ నిలిచింది. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం నిలిచింది. ఇదే సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాజు సుందరం గెలుచుకున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్.. అమెరికాకు చెందిన సాఫ్ట్‏వేర్ కంపెనీ సీఈఓగా కనిపిస్తాడు. ఈ చిత్రానికి రెండు జాతీయ చలన చిత్ర పురస్కారాలు వచ్చాయి. ఈ మూవీ ముఖ్యంగా మేసేజ్ ఒరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్‏గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలవడానికి ముఖ్యంగా ఈ ఐదు కారణాలను చెప్పుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మహర్షి సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్‏గా నిలిచింది. అలాగే కమర్షియల్ ఎంటర్ టైనర్‏గానూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేశ్, వంశి పైడిపల్లి కాంబోలో వచ్చే సినిమా పై  ప్రేక్షకులలో ముందుగానే భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. సినిమా ఉండటంతో సూపర్ హిట్ సాధించింది.

2. ఇవే కాకుండా.. హీరో స్ర్కీన్ ఉనికి, ఎడిటింగ్ ఈ మూవీకి హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఒక కాలేజీలోని యువత మానసిక స్థితి గురించి.. ఈ సినిమాలో చూపించిన తీరు మరింత బలం అనుకోవచ్చు.

3. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఇందులోని చోటి చోటి బాటిన్ అనే సాంగ్ స్నేహితుల మధ్య ప్రతి సన్నివేశాన్ని అందంగా తెరకెక్కించారు. దేవి శ్రీ సంగీతం ఈ చిత్రానికి మరో బలంగా మారాయి.

4. ఇక ఇందులో ప్రకాశ్ రాజ్, జయసుధ జంట నటన మరింత హైలెట్ ఉండగా.. జగపతి బాబు, నరేష్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, ముఖేష్ రిషి, నాసర్, రావు రమేష్, కోట శ్రీనివాస రావు, అన్నపూర్ణ, పోసాని కృష్ణ మురళి వంటి నటుల నటనతో మరింత ఆకట్టుకున్నారు.

5. ఈ సినిమాకు మరో బలం.. అల్లరి నరేష్. ఇందులో నరేష్ యాక్టింగ్ పవర్‏కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నరేష్ నటన మార్క్ క్రియేట్ చేశాయి. ఇందులో నరేష్.. తన పాత్రకు మించి ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు.

Also Read:

పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్‏డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..

త్రివిక్రమ్ గారి వల్లే ‘వకీల్ సాబ్’ ఛాన్స్.. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్..