Tollywood Movies: థియేటర్లలో సందడి చేయనున్న చైతూ.. ఈ వారం థియేటర్లలో / ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..

|

Jul 18, 2022 | 11:03 AM

కంటెంట్ ఉన్న చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలు థియేటర్లలో

Tollywood Movies: థియేటర్లలో సందడి చేయనున్న చైతూ.. ఈ వారం థియేటర్లలో / ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే..
Thank You
Follow us on

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ చిత్రాలు సందడి చేశాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న కథలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. కంటెంట్ ఉన్న చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్న సినిమాలెంటో తెలుసుకుందామా.

థాంక్యూ..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం థాంక్యూ. రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథనాయికలుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ జూలై 22న థియేటర్లలో సందడి చేయనుంది.

షంషేరా..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ కపూర్, సంజయ్ దత్, వాణికపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం షంషేరా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో రణ్ బీర్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.

హై ఫైవ్..
చాలా కాలం తర్వాత డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా హై ఫైవ్. ఇందులో మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 22న రిలీజ్ కానుంది.

మాహా..
తమిళ్ స్టార్ శింబు, హన్సిక జంటగా నటిస్తోన్న చిత్రం మహా. ఇందులో శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తుండగా.. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూలై 22న విడుదల కానుంది.

దర్జా..
బుల్లితెర యాంకరమ్మ అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దర్జా. డైరెక్టర్ సలీమ్ మాలిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది.

ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..
ఎఫ్ 3..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. జూలై 22 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మీమ్ బాయ్స్ తమిళ్ సిరీస్, డాక్టర్ అరోరా (హిందీ సిరీస్) కూడా జూలై 22న సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

అలాగే నెట్ ఫ్లిక్స్ లోనూ ఎఫ్ 3 జూలై 22న స్ట్రీమింగ్ కానుంది. ఇండియన్‌ ప్రిడేటర్‌ (హిందీ సిరీస్‌), యూత్‌ ఆఫ్‌ మే (కొరియన్‌ సిరీస్‌) జూలై 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ద గ్రే మ్యాన్‌ తెలుగు డబ్బింగ్‌ జూలై 22న స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఆహాలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన ఏజెంట్ ఆనంద్ సంతోష్ జూలై 22న స్ట్రీమింగ్ కానుంది.

రికమెండెడ్‌ ఫర్‌ యూ షార్ట్‌ఫిల్మ్‌ జులై 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మోస్ట్ ఫేమస్ తెలుగు సిరీస్ పరంపర-2 జులై 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.