Prabhas: ఇది కదా మాకు కావాల్సింది..! ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్

|

Apr 30, 2024 | 4:52 PM

దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నాడు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో పటు నాగ్ అశ్విన్ తో కల్కి , మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు పూర్తయిన వెంటనే.. సలార్ 2, స్పిరిట్ సినిమాలను మొదలు పెట్టనున్నాడు.

Prabhas: ఇది కదా మాకు కావాల్సింది..! ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్ సినిమాలతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నాడు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో పటు నాగ్ అశ్విన్ తో కల్కి , మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు పూర్తయిన వెంటనే.. సలార్ 2, స్పిరిట్ సినిమాలను మొదలు పెట్టనున్నాడు. రాజా సాబ్ సినిమా షూటింగ్ సైలెంట్ గా కనిచేస్తున్నాడు మారుతి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోషన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని టాక్. వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి బాబు, సప్తగిరి, బ్రహ్మానందం ఇతర పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రభాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలను నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు రాజా సాబ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నటన, యాక్షన్ తో పాటు డాన్స్ కూడా అదరగొట్టనున్నారట. ఈ మేరకు సినిమాలో ఓ మాస్ మాసాల సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి ప్రభాస్ ఈ సాంగ్ కు స్టెప్పులేయనున్నారట. నిధి అగర్వాల్, మాళవిక, రిద్ది కుమార్‌తో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. డ్యాన్సులతో కూడా దుమ్ము లేపుతాడు ప్రభాస్.. కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ డాన్స్ చేసే రేంజ్ లో పాటలు రాలేదు. దాంతో ఏ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కోరిక తీరబోతుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.