మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఓం శాంతి శాంతి శాంతిః టికెట్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్.. వారికి మాత్రమే

‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ తదితర చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటాడు తరుణ్‌ భాస్కర్‌. అయితే ఆ మధ్యన మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ రెండో సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్

మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఓం శాంతి శాంతి శాంతిః టికెట్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్.. వారికి మాత్రమే
Om Shanti Shanti Shantihi

Updated on: Jan 29, 2026 | 6:45 AM

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ . ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (జనవరి 30) విడుదల కానుంది. గురువారం (జనవరి 29) సాయంత్రం ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక బంపరాఫర్ ను ప్రకటించించింది. ఒక టికెట్‌ కొంటే మరొటి ఉచితంగా పొందచ్చని తెలిపింది. అయితే కేవలం దంపతులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కండిషన్ పెట్టింది. మరోవైపు తక్కువ ధరకే ఈ సినిమాని చూసేలా రెగ్యులర్‌ షో టికెట్లపై చిత్ర బృందం ఇప్పటికే ఆఫర్‌ ప్రకటించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.99 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 ప్లస్ జీఎస్టీతో కలిపి టికెట్ ధరలను నిర్ణయించింది. ప్రస్తుతానికి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్న థియేటర్ల జాబితాను వెల్లడించింది. ఆ థియేటర్ల వివరాలివీ..

  • ఏషియన్‌ ముక్త సినిమాస్‌: అగనంపూడి (విశాఖపట్నం)
  • వీపీసీ: అమలాపురం
  • మినీ రేవతి: మచిలీపట్నం
  • గౌతమి: అనంతపురం

కాగా మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘జయ జయ జయ జయహే’ కు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారని పిస్తోంది. అహంకారం కగిలిన కోపిష్టి భర్తకు భార్య ఎలా బుద్ధి చెప్పిందన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాకు ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జై క్రిష్ సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.