68వ జాతీయ చలన చిత్ర అవార్డుల(68th National Film Award)ప్రదానం నేడు అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో తెలుగు సినిమాలు సత్తాచాటాయి. మూడు తెలుగు సినిమాలకు అవార్డులు వరించాయి. కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ చిత్రం, నాట్యం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్, అలాగే అల వైకుంఠపురంలో సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు దక్కాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా గురించి అందరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అనుకున్నట్టే అయింది. .జాతీయ స్థాయిలో తమన్ పేరు మరో సారి మారుమ్రోగిపోతోంది. అల వైకుంఠపురంలో.. కారణంగా.. ఏకంగా జాతీయ ఉత్తర మ్యూజిక్ డైరెక్టర్ అనే అవార్డు.. ట్యాగూ.. తమన్ కు వచ్చేసింది. ఇప్పుడిదే టాక్ నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది.
తాజాగా కేంద్రం.. 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను అనౌన్స్ చేసింది. అయితే ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా.. సుహాస్ నటించిన కలర్ ఫోటో నిలవగా.. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎన్నికయ్యారు. తను కంపోజ్ చేసిన అల వైకుంఠపురం మ్యూజిక్ కు గాను తమన్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నేషనల్ వైడ్ బజ్ చేసింది. ఇక తమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో బజ్ చేశాయి. ఇన్‌స్టా రీల్స్ రూపంలో ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాయి. దీంతో అందరూ అనుకున్నట్టే.. జాతీయ అవార్డును తమన్ కు కట్టబెట్టాయి.