Ram Charan- Shankar : చరణ్ – శంకర్ సినిమా నయా గాసిప్.. తమన్ పాటలకు స్టెప్పులేయనున్న మెగా పవర్ స్టార్..?

డ్యాన్స్‌ల్లో ఇరగదీసే చరణ్.. తమన్ పాటలకు స్టెప్పులేస్తే.. ఎలా ఉంటుంది.. అదిరిపోతుంది కదూ... ఆ.. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇంతకీ ఏ సినిమా కోసం అని అనుకుంటున్నారా.. ఇంకే సినిమా... రామ్‌ చరణ్ కెరియర్ లో 15వ  సినిమాలో

Ram Charan- Shankar : చరణ్ - శంకర్ సినిమా నయా గాసిప్..  తమన్ పాటలకు స్టెప్పులేయనున్న మెగా పవర్ స్టార్..?
Thaman

Updated on: Apr 01, 2021 | 9:41 PM

Ram Charan- Shankar : డ్యాన్స్‌ల్లో ఇరగదీసే చరణ్.. తమన్ పాటలకు స్టెప్పులేస్తే.. ఎలా ఉంటుంది.. అదిరిపోతుంది కదూ… ఆ.. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇంతకీ ఏ సినిమా కోసం అని అనుకుంటున్నారా.. ఇంకే సినిమా… రామ్‌ చరణ్ కెరియర్ లో 15వ  సినిమాలో.. అదే నండి  శంకర్‌ డైరెక్షన్లో రామ్‌ చరణ్ హీరోగా రాబోయే సినిమాలో..! ఎస్‌ డైరెక్టర్‌ శంకర్‌.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కాంబోలో.. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వస్తోన్న సినిమాలో టాలీవుడ్ మ్యూజిక్ తరంగం ఎస్ ఎస్ తమన్  మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్‌ అయ్యాడని తెలుస్తుంది.

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కాగా, అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు వంద కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో రామ్ చరణ్- శంక‌ర్ సినిమా ఉంటుంద‌ని ప్రచారం న‌డుస్తుంది. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుథ్ ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక చేసిన‌ట్టు గ‌తంలో ప్ర‌చారం జ‌ర‌గ‌గా ఆతర్వాత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పేరు వినిపినించింది. తాజాగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna: జోరు పెంచిన మహేష్ హీరోయిన్ ఏకంగా నాలుగు భాషల్లో రాణించాలని చూస్తున్న రష్మిక..