Actor Vijay : రాజకీయ నేపథ్యం హైలైట్‌‌‌‌‌‌గా దళపతి నెక్స్ట్ సినిమా.. దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్…

దళపతి విజయ్ ఇటీవల 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో పర్లేదు అనిపించుకున్న

Actor Vijay : రాజకీయ నేపథ్యం హైలైట్‌‌‌‌‌‌గా దళపతి నెక్స్ట్ సినిమా.. దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్...

Updated on: Mar 04, 2021 | 10:13 AM

Thalapathy Vijay next movie : దళపతి విజయ్ ఇటీవల ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో పర్లేదు అనిపించుకున్న తమిళ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ కు విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా తర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోందని అంటున్నారు. దళపతి కెరియర్ లో ఈ సినిమా 65వది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్బ్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. తాజాగా సమాచారం ప్రకారం మార్చి 15 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. అలాగే 2021 దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట చిత్ర నిర్మాతలు. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విజయ్ సినిమాలు అవలీలగా 200 కోట్లను వాసులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దళపతి 65వ సినిమాను భారీబడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీబ్యూటీ రష్మిక మందన ను ఎంపిక చేసారని ఆ మధ్య వార్తలు వచ్చాయి, ఆతర్వాత పూజ హెగ్డే పేరు కూడా వినిపించింది. కానీ ఇంతవరకు ఈ విషయం పై క్లారిటీ రాలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Taapsee Pannu : స్టార్ హీరోయిన్ పై ఆదాయపన్ను శాఖ దాడులు.. అమ్మడి పై ఐటీ పగపట్టడానికి కారణం అదేనా..?

Kajal Aggarwal : కవ్విస్తున్న కాజల్.. ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల చందమామ .. ఫిదా అవుతున్న అభిమానులు..