Tollywood: టాలీవుడ్‌కు గుడ్ న్యూస్. సినిమాల థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచితేనే బెటర్ అన్నది ఏపీ ప్రభుత్వం(Ap Government) వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారమే త్వరలో థియేటర్లలో రేట్ల పెంపు ఉండబోతోంది. ఇంతకీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి.. ఇదే ఇప్పుడు టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్. అవును, కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లలో పెద్దగా తేడాల్లేవుగానీ.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెరగాలన్నదే సారాంశం. ఆ రిపోర్ట్ ప్రకారం.. ప్రాంతం ఏదైనా సరే, నాన్ ఏసీ థియేటర్లు(Movie Theaters) ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర 30 రూపాయలు ఉండాలి. జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే. అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25రూపాయలు అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను.. 70 రూపాయలకు పెంచాలని రిపోర్ట్ ఇచ్చింది.
ఇక ఏసీ సినిమా హాళ్ల విషయానికొస్తే.. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35 ప్రకారం గ్రామపంచాయతీలైతే కనిష్టంగా 10, గరిష్టంగా 20 రూపాయలుంది. అదే నగర పంచాయతీల్లో కనిష్టంగా 15, గరిష్టంగా 35, మున్సిపాలిటీల్లో తక్కువగా 40, ప్రీమియం టికెట్ రేట్ 100 ఉంది. ఈ రేట్లు సవరించాలని కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం ఏసీ థియేటర్‌లో మినిమమ్ 40 రూపాయలు ఉండాలి. అత్యధికంగా 150 రూపాయలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వాలి. అంటే.. ఏసీ థియేటర్లలో ఇన్నాళ్లూ అత్యధికం అనుకున్నది ఇప్పుడు కనిష్ట రేటుగా మారబోతోంది. ఇక మల్టీప్లెక్సుల విషయానికొస్తే.. టాప్ టు బాటమ్ ఒకటే టికెట్ కాకుండా.. కచ్చితంగా ప్రీమియం, డీలక్స్, ఎకానమీ క్లాస్‌లు ఉండాలన్నది కమిటీ చెప్పిన మాట. మల్టిప్లెక్సుల్లో ఇప్పటికే జీవో ప్రకారం అత్యధిక ధర 250 రూపాయల వరకూ ఉంది.
ఇక కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో రెండు కీలక అంశాలున్నాయి. జీవో నెంబర్ నెంబర్ 35 ప్రకారం థియేటర్లను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలుగా విభజించారు. కానీ కమిటీ మాత్రం ఈ బేధాలు వద్దని సలహా ఇచ్చింది. అంటే హాల్ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ.. టికెట్ రేట్లు మాత్రం ఏసీనా, నాన్ఏసీనా, మల్టిప్లెక్సా అన్న దానితోనే ముడిపడి ఉంటుందన్నమాట. కమిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్‌పై కాసేపట్లో సీఎంతో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని భేటీ అవుతారు. సీఎం జగన్‌తో రేపటి సినీ పెద్దల భేటీలో మాట్లాడాల్సిన అంశాలు, కమిటీ రిపోర్ట్ తర్వాత ఫిక్స్ చేయబోతున్న రేట్లను కూడా వాళ్లకు చెప్పే చాన్స్ ఉంది.
Also Read: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది