Bangalore Rave Party: నాకేం తెలియదు.. బర్త్ డే పార్టీ అంటే వెళ్లాను.. కానీ.. తెలుగు నటి..

|

May 23, 2024 | 11:34 AM

ఆ రేవ్ పార్టీలో తాను లేనంటూ నటి హేమ ఓ వీడియోను రిలీజ్ చేసింది. కానీ ఆమె వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే హేమ ఫోటోను మీడియా ముందు పెట్టారు బెంగళూరు పోలీసులు. దీంతో హేమ కవరింగ్ విషయం సోషల్ మీడియాలో రచ్చ లేపింది. రేవ్ పార్టీ గురించి ఏమాత్రం మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నానంటూ హేమ వరుస వీడియోస్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారంటూ ప్రచారం నడిచింది.

Bangalore Rave Party: నాకేం తెలియదు.. బర్త్ డే పార్టీ అంటే వెళ్లాను.. కానీ.. తెలుగు నటి..
Ashi Roy
Follow us on

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో ఇప్పుడు బెంగుళూరు రేవ్ పార్టీ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, హీరోహీరోయిన్లు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీలో తెలుగు నటి హేమ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హేమతోపాటు చాలా మంది తెలుగు నటీనటులు ఉన్నారంటూ చెప్పిన బెంగుళూరు పోలీసులు వారి పేర్లు బయటపెట్టలేదు. అయితే ఆ రేవ్ పార్టీలో తాను లేనంటూ నటి హేమ ఓ వీడియోను రిలీజ్ చేసింది. కానీ ఆమె వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే హేమ ఫోటోను మీడియా ముందు పెట్టారు బెంగళూరు పోలీసులు. దీంతో హేమ కవరింగ్ విషయం సోషల్ మీడియాలో రచ్చ లేపింది. రేవ్ పార్టీ గురించి ఏమాత్రం మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నానంటూ హేమ వరుస వీడియోస్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారంటూ ప్రచారం నడిచింది. కానీ తాము లేమని.. అసలు ఆ పార్టీ గురించి తమకేం తెలియదంటూ వివరణ ఇచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు మరో తెలుగు నటి పేరు వినిపిస్తుంది. తనే ఆషీ రాయ్. బెంగుళూరు జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి ఆషీ రాయ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆషీరాయ్ మాట్లాడుతూ.. తాన పార్టీకి వెళ్లింది నిజమే అని.. కానీ అది బర్త్ డే పార్టీ మాత్రమే అని తెలిపింది. వాసు అనే వ్యక్తి సన్ సెట్ టు సన్ రైజ్ కాన్సెప్టుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించాడు. వాసు బిల్డర్, బుకీగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వ్యక్తి అని సమాచారం. కేవలం అతడితో ఉన్న పరిచయం పిలుపు కారణంగానే ఆ బర్త్ డే పార్టీకి వెళ్లానంటూ చెప్పుకొచ్చింది.

అది కేవలం బర్త్ డే పార్టీ అని.. కానీ అక్కడ ఏం జరిగిందనేది తనకు తెలియదని చెప్పుకొచ్చింది. పోలీసులు వచ్చినప్పుడు తాను అక్కడే ఉన్నానని.. బ్లడ్ శాంపిల్ ఇచ్చినట్లు తెలిపింది. అలాగే అక్కడ నటి హేమను తాను చూడలేదని.. లోపల ఏం చేస్తున్నారో తనకు తెలియదని.. కొకైన్, ఇతర మత్తు పదార్థాలు దొరకండ గురించి తనకు ఏం తెలియదని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.