నా కుమారుడిని రక్షించండి.. అట్లాంటా ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ యాక్టర్ కొడుకు మిస్సింగ్..

అమెరికా అట్లాంటాలో తెలుగు యువకుడు మిస్సయ్యాడు. రెండ్రోజుల క్రితం మిస్సైన తన కుమారుడి జాడ వెతికి పెట్టండంటూ యాక్టర్ శ్రీధర్‌ రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నాడు. అయితే మిస్సైన యువకుడి ఫోన్ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు ఓ అమెరికన్ శ్రీధర్ రెడ్డి స్నేహితుడికి సమాచారమిచ్చాడు. అక్కడకు వెళ్లగా ఫోన్ లేదని తేలింది..

నా కుమారుడిని రక్షించండి.. అట్లాంటా ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ యాక్టర్ కొడుకు మిస్సింగ్..
Tollywood Actor Son Missing

Updated on: Jun 25, 2025 | 12:16 PM

అట్లాంటా ఎయిర్‌పోర్టులో ఓ తెలుగు యువకుడు మిస్సయ్యాడు. జూన్ 22న రాత్రి పది గంటలకు తన కొడుకు మనీష్‌ వీడియో కాల్ చేశాడని.. తర్వాత కాంటాక్ట్‌లో లేడంటూ యాక్టర్ శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే మిస్సైన యువకుడి ఫోన్ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు ఓ అమెరికన్ శ్రీధర్ రెడ్డి స్నేహితుడికి సమాచారమిచ్చాడు. శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడ్ని ఎయిర్‌పోర్టుకు పంపగా.. ఫోన్ లేదని తేలిందన్నారు. దయచేసి పోలీసులు లొకేషన్‌ను ట్రేస్ చేసి… తన కుమారుడ్ని రక్షించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు యాక్టర్ శ్రీధర్ రెడ్డి, అతని భార్య..

మనీష్ మిస్సింగ్‌పై తీవ్ర ఆందోళనలో ఉన్నారు తల్లిదండ్రులు. డబ్బుల కోసం ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?. ఇంకేమైనా జరిగిందా.. అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ, ఎన్ఆర్ఐలు.. తమ కుమారుడి ఆచూకి కోసం సహాయం చేయాలని యాక్టర్ శ్రీధర్ రెడ్డి కోరుతున్నారు.

వీడియో చూడండి..

అయితే.. ఇప్పటికే.. కొడుకు మిస్సింగ్ పై ఫిర్యాదు చేశామని శ్రీధర్ రెడ్డి దంపతులు వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..