
సెప్టెంబర్‌లో పైరసీ ముఠా అరెస్ట్‌తో డొంక కదిలింది. పాట్నాలో ప్రధాన నిందితుడు అశ్వనీకుమార్‌ని అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. అశ్వనీకుమార్ సహా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కూపీలాగారు పోలీసులు. పదేళ్లుగా విచ్చిలవిడిగా సాగుతున్న సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ పైరసీలో కీలకంగా వ్యవహరించాడు ఐ బొమ్మ నిర్వాహకుడు రవి. ఇదివరకు థియేటర్లకు వెళ్లి షూట్ చేసి అప్‌లోడ్ చేసిన పైరసీగాళ్లు.. ఐ బొమ్మ యాక్టివ్ కావడంతో సీన్ మారింది. మంచి క్వాలిటీ సినిమాలను అప్‌లోడ్ చేస్తోన్న ఐ బొమ్మ… పైరసీ చేసే హ్యాకర్లను సినిమాకు రూ.లక్ష చొప్పున ఇచ్చాడు రవి. ఇమ్మడి రవి అరెస్ట్‌తో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.
రెండేళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు వెబ్‌సైట్ ద్వారానే సవాల్ విసిరాడు నిర్వాహకుడు. అప్పటి నుంచి ఇమ్మడి రవి కోసం గాలిస్తున్నారు. ఇన్నాళ్లూ ఐ బొమ్మ వెనక ఉన్నది ఎవరనేది మిస్టరీగా ఉన్నా.. ఈరోజుతో క్లారిటీ వచ్చింది. ఐ బొమ్మలో.. ఐ ఫర్ ఇమ్మడి అనేది తేలిపోయింది. ఇమ్మడి రవే ఈ పైరసీ కుంభకోణం వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. అతడి దగ్గర వందల సంఖ్యలో పైరసీ సినిమాలు కనిపెట్టారు. ఓటీటీలోకి వచ్చిన ప్రతీ సినిమాను క్షణాల్లో కాపీ చేసి.. తన వెబ్‌సైట్లో పెట్టి నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాడు. దీంతో సినీ నిర్మాతలంతా ఐబొమ్మపై ఫిర్యాదు చేశారు.
మమ్మల్ని ఆపలేరు… మమ్మల్ని వెతకలేరు అంటూ సవాల్ విసిరాడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు. మేము ఒక్క దేశానికి పరిమితం కాదు మాది గ్లోబల్ నెట్‌వర్క్ అంటూ గతంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌లోనే పోస్ట్ పెట్టాడు. పోలీసుల చర్యలతో బిగ్ స్టార్‌ల ఇమేజ్ ప్రమాదంలో పడుతుందన్నాడు. హీరోలు కూడా తమ సైట్‌కి సబ్‌స్క్రైబ్ అయ్యారని.. ఎవరనేది బయటపెడతామన్నాడు. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరికలు జారీచేశాడు. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే – మమ్మల్ని ఆపడం అసాధ్యం అంటూ గతంలో పోస్ట్ చేశాడు. ఏ హీరోనైనా ఎక్స్‌పోజ్ చేస్తాం – ఎవరికీ మినహాయింపు లేదంటూ రాసుకొచ్చాడు. భయపడని మనిషి కంటే ప్రమాదకరుడు లేడని వార్నింగ్ ఇచ్చాడు ఐబొమ్మ నిర్వాహకుడు. ఆ పోస్ట్ పెట్టింది ఇమ్మడి రవే అన్న క్లారిటీ వచ్చింది. రవి అరెస్ట్‌తో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.
తాజాగా టీవీ9ను ఎక్స్‌క్లూజీవ్‌గా ఇమ్మడి రవి ఫోటో సాధించింది. ఈ రోజు న్యూస్‌తో పాటు మీమ్స్‌లో వైరల్ అవుతున్న ఇమ్మడి రవి ఫోటో దిగువన చూడండి…
Immadi Ravi