
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలో నిధి అగర్వాల్ ఒకరు.

ప్రియాంక జవాల్కర్...ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించింది వీటిలో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంది.

సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. పై ఫోటో ఓ షార్ట్ ఫిలిమ్ లోనిది. ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.

తాజాగా ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై నెటిజన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.