Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్.. ఆ పార్టీ సపోర్టుతోనే ఎగువ సభలోకి..

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్‎లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, శింబు, త్రిష కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కమల్ రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు.

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్.. ఆ పార్టీ సపోర్టుతోనే ఎగువ సభలోకి..
Kamal Haasan

Updated on: May 28, 2025 | 11:55 AM

సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, 2025న జరగనున్న నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం పి. విల్సన్, ఎస్.ఆర్. శివలింగం, కవిన్నా సల్మాల పేర్లను రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతోపాటు మక్కల్ నీది మయ్యం తరపున కమల్ హాసన్ పేరును తీర్మానం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభకు కమల్ హాసన్ ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం తెలిపింది. తమిళనాడులోని అధికార డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తామని ఆధికారిక పార్టీ డీఎంకే వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి.

కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు.. “ఇక్కడ నాకు కుటంబం ఉంది.. అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది” అని అన్నారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించారని.. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో శింబు, శివరాజ్ కుమార్, త్రిష కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..