
తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారో అప్పటి నుంచి త్రిష పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. విజయ్ కు త్రిషకు మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రకాల గుసగుసలు వినిపించాయి. విజయ్ ప్రమాణ స్వీకారంలోనూ త్రిష సందడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పలువురు రాజకీయ నాయకులు కూడా త్రిష పై నోరు జారీ కామెంట్స్ చేశారు. తాజాగా త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవలే తంజావూరులో జరిగిన నిరసనల కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ త్రిష పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
తంజావూరులో కావేరీ నదీ జలాల అంశం పై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ ప్రదర్శనలో ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ పై, ఆయన సర్కార్ పై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పలువురు నేతలు త్రిష. త్రిష అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దాంతో ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అయితే తాను చెప్పింది కావేరీ గురించెనని ఉదయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అటు టీవీకే పార్టీ కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడింది. ఉదయనిధి స్టాలిన్ పై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసింది. మహిళ గురించి ఇంత నీచంగా, అసహ్యంగా మాట్లాడటం సరికాదని, డీఎంకే దిగజారుడు రాజకీయం చేస్తుందని టీవీకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే బీజేపీ నేతలు కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ.. జాతీయ మహిళా కమిషన్‌ను ఫిర్యాదు చేసింది. ఉదయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే .. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీవీకే పార్టీ డిమాండ్ చేసింది. కాగా వ్యాఖ్యల తర్వాత తమిళనాడు లో చాలాచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.. పోలీసులు ఉదయ్ నిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు. ఉదయనిది స్టాలిన్ నివాసానికి పోలీసులు వచ్చారు.. దీంతో డిఎంకె కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.. గందరగోళం మధ్య ఉదయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.