Tollywood : ఇండస్ట్రీలో విషాదం.. నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య..

ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కె. రాజన్ అడయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tollywood : ఇండస్ట్రీలో విషాదం.. నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య..
K Rajan

Updated on: May 17, 2026 | 8:06 PM

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కె. రాజన్ అడయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కె. రాజన్ 1983లో బ్రహ్మచారిగల్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అతను ప్రభుదేవా డబుల్స్, ఆమె పావం , సోయంత దాట్ల వంటి చిత్రాలను కూడా నిర్మించాడు. ఆయన నమ్మ ఊరు మరియమ్మ, అంబగిగల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతను కబడ్డీ కబడ్డీ, పాంబు సట్టై, అజితిన్ తడువు, పగసూరన్ వంటి చిత్రాలలో కూడా నటించాడు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. తమిళ చిత్రసీమలోని చిన్న బడ్జెట్ చిత్రాలకు తన మద్దతును కొనసాగిస్తున్నారు. నిర్మాత కె. రాజన్ చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఫిల్మ్ ఫెస్టివల్స్, ఇంటర్వ్యూల ద్వారా తన అభిమానులలో చాలా ప్రజాదరణ పొందాడు. మే 17 ఆదివారం సాయంత్రం తన కారులో ప్రయాణిస్తన్న రాజన్.. అడయార్ వంతనపై నుంచి వెళ్తున్న కారును ఆపమని డ్రైవర్ కు చెప్పి.. అనతరం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచరం అందించగా.. అగ్నిమాపక శాఖ సహాయంతో అతని మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

రాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సోషల్ మీడియాలో తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

Follow Us