తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. కంటెంట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. కొత్త కథలకు మద్దతునిస్తూ.. నూతన దర్శకులకు సపోర్ట్ అందిస్తుంటారు. అలాగే కథ నచ్చితే చాలు అందులోని పాత్ర కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. ఇప్పటివరకు ధనుష్ చేసిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తమిళ్ చిత్రపరిశ్రమలో కంటెంట్ ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో ధనుష్.. విక్రమ్.. సూర్య నిలుస్తారు. ఇక తాజా సమాచారం ప్రకారం ధనుష్ మరో ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్నారు.
ఆయన లేటేస్ట్ మూవీ నానే వరువేన్ చిత్రంలో ధనుష్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారట. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ఒకే పోస్టర్ ద్వారా నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. ఒక పాత్ర డీసెంట్ గా.. మరో పాత్ర అందుకు పూర్తి భిన్నంగా..మానసిక స్థితి సరిగ్గాలేని మాస్ పాత్ర మాదిరిగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలను పూర్తిగా పెంచేశారు మేకర్స్స. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇందుజ రవి చందర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here we go ? @theVcreations @dhanushkraja @thisisysr pic.twitter.com/G90lh5J9Ei
— selvaraghavan (@selvaraghavan) February 11, 2022
Also Read: VK Naresh: సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీపై స్పందిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..
Prabhas: పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. వి మిస్ యూ అంటూ..
Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)