RNR Manohar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు.. దర్శకుడు కన్నుమూత..

|

Nov 17, 2021 | 6:36 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు.. దర్శకుడు ఆర్ఎన్ఆర్ మనోహర్

RNR Manohar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు.. దర్శకుడు కన్నుమూత..
Rnr Manohar
Follow us on

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు.. దర్శకుడు ఆర్ఎన్ఆర్ మనోహర్ (61) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇరవై రోజుల క్రితం ఆయన కరోనా బారీన పడడంతో అప్పటి నుంచి అదే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు.

మనోహర్ పలు తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొళంగల్, దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఆర్య టెడ్డీ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. అలాగే మాసిలమణి చిత్రానికి మనోహర్ దర్శకత్వం వహించారు. మనోహర్ 10 ఏళ్ల కుమారుడు ఎం రంజన్ 2012లో పాఠశాల స్విమ్మి్ంగ్ ఫూల్ లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన తనయుడు ప్రాణాలు కోల్పోయినందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్విమ్మింగ్ కోచ్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు, స్విమ్మింగ్ పూల్ కాంట్రాక్టర్లపై ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ ఫిర్యాదు చేశారు. ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ కుమారుడి మృతికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: Suriya: నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ.. మీ నమ్మకం, భరోసాకు కృతజ్ఞుడిని.. సూర్య ఆసక్తికర పోస్ట్..

Cauliflower: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న ‘క్యాలీ ఫ్లవర్‌’ టీజర్‌..

Kangana Ranaut: మోడీ కూడా మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ మహిళా నేత..