నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ మృతి చెందాడన్న వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. గత కొంతకాలంగా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. సోమవారం హార్డ్ అటాక్‌తో చనిపోయినట్లు తెలిసింది. బాల నటుడిగా సౌత్‌లొ 200పైగా చిత్రాల్లో నటించిన సూర్య కిరణ్.. ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ధన, బ్రహ్మస్త్రం, రాజూ భాయ్ వంటి సినిమాలు తీసినా సక్సెస్ దక్కలేదు. నటి కళ్యాణిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సూర్య కిరణ్. విబేధాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు.
అయితే తీసిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవ్వడం.. అటు వైవాహిక బందానికి బీటలు వారడంతో.. మానసికంగా కుంగిపోయి చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు సూర్య కిరణ్. దాదాపు 7 సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా ఉన్న సూర్య కిరణ్.. 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా అనూహ్య రీతిలో ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడ ఆయన నెగ్గుకురాలేకపోయారు. ఫస్ట్ వీకే బయటకు వచ్చేశారు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. తన వ్యక్తిగత జీవితం విషయాలను చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు సూర్య కిరణ్.
కళ్యాణి తన అమ్మ తరువాత అమ్మ అని చెప్పుకొచ్చారు. ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉన్నట్లు తెలిపారు. తన సోదరీమణులపై ఎంత ప్రేమ ఉంటుందో.. కళ్యాణి అంటే అంతే ఇష్టం, ప్రేమ ఉంటామయన్నారు. కళ్యాణి తన జీవితంలో లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. నేను తనకి అవసరం లేకపోవచ్చు.. నాకైతే ఆమె ఎప్పటికీ అవసరమే అని ఎమోషనల్ అయ్యారు సూర్య కిరణ్. విడాకులు ఇద్దర్నీ వేరుచేసినా.. మనసుల్ని మాత్రం దూరం అవ్వలేదని చెప్పుకొచ్చారు. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ ఆయన చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తన ఫోన్‌లోనూ.. ల్యాప్ ట్యాప్‌లోనూ కళ్యాణి ఫొటోనే ఉంటుందని చెప్పారు. సూర్య కిరణ్ మీడియాతో మాట్లాడిన చివరి మాటలు అయితే ఇవే.
Sathyam, Dhana 51, Raju Bhai fame, Director #SuryaKiran Passed away due to ill health.
Om Shanthi pic.twitter.com/k3QvTF1z2k
— Vamsi Kaka (@vamsikaka) March 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.