
ప్రస్తుతం సీజన్ సమ్మర్ నడుస్తోంది. అంటే ఆవకాయ సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో ప్రతి ఇంట్లో కచ్చితంగా మామిడి కాయ పచ్చడి ఉండాల్సిందే. ఈ మధ్యన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా సొంతంగా ఆవకాయ పచ్చళ్లను తయారు చేసుకుంటున్నారు. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కొణిదెల స్వయంగా ఆవకాయ పచ్చడిని తయారు చేశారు. అంతేకాదు తమ అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ లోకి ఈ పచ్చడిని కూడా చేర్చి విక్రయించడం ప్రారంభించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ ఆవకాయ పచ్చడి కలిపింది. తన తల్లి సహాయంతో నోరూరించే రుచికరమైన మామిడి కాయ పచ్చడిని తయారు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పైనున్న ఫొటో అదే. మరి అందులో ఆవకాయ కలుపుతున్న దెవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు.. అప్ కమింగ్ హీరోయిన్ సుప్రిత.
సుప్రిత ఆవకాయ పచ్చడి తయారు చేస్తోన్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటున్నారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుప్రిత త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆమె లేచింది మహిళా లోకం మూవీతో పాటు బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి ఓ ప్రేమకథా చిత్రం చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
😍🥭 @_supritha_9 pic.twitter.com/BiP7U5tz3r
— Artist Surekhavani (@Surekhavani_) May 12, 2025
వీటితో పాటు అమరావతికి ఆహ్వానం పేరుతో తెరకెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది సుప్రితత. ఈ మూవీలో ఆమెతో పాటు ఎస్తర్, ధన్యబాలకృష్ణ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. శివ కంఠంనేని హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.