Anubhavinchu Raja: ఈ టైంలో సినిమా చేయడం అవసరమా అనిపించింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రియ..

|

Nov 25, 2021 | 7:53 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా.

Anubhavinchu Raja: ఈ టైంలో సినిమా చేయడం అవసరమా అనిపించింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రియ..
Supriya
Follow us on

Anubhavinchu Raja: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నటి నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ..  దర్శకుడు శ్రీను వచ్చి కథ చెప్పాడు. బాగా నవ్వాను. ఇంత నవ్వించాడు కదా? సినిమా తీయాలని అనుకున్నాను.

ఈ కథను నాగార్జున, నాగ చైతన్యలకు వినిపించాను. వాళ్లకు బాగా నచ్చింది సినిమా తీయాలని అనుకున్నాం. కానీ కరోనా వచ్చి పడింది. ఈ టైంలో సినిమా తీయాలా..? అని అనుకున్నాం. కానీ మళ్లీ శ్రీను వచ్చాడు. ఏడాదికి ఒక్క సినిమా అది చిన్నదైనా పెద్దదైనా తీయాలని అనుకున్నాం. ఓ చిన్న సినిమాకు అన్నపూర్ణ బ్యాక్ ఎండ్‌లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అని మీరు నిరూపించారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయల పని చేశారు. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఈ స్లాంగ్‌, ఈ కారెక్టర్‌ కోసం రాజ్ తరుణ్ గుర్తుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తావా? అని నేనే అడిగాను అన్నారు. పక్కన మీకు నచ్చిన వాళ్లను పెట్టుకోండి. ఓ రెండున్నర గంటలపాటు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు సుప్రియ యార్లగడ్డ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..