Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న’సర్కారు వారి పాట’

|

May 06, 2022 | 1:30 PM

మహేష్ ఈ సారి దిమ్మతిరిగే హిట్టును తన ఖాతాలో వేసుకునేలానే కనిపిస్తున్నారు. కరోనా గ్యాప్‌ తరువాత తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను... తన స్టైల్లో ఎంటర్ టైన్ చేసేందుకు వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్నసర్కారు వారి పాట
Sarkaru Vaari Paata
Follow us on

మహేష్(Mahesh Babu) ఈ సారి దిమ్మతిరిగే హిట్టును తన ఖాతాలో వేసుకునేలానే కనిపిస్తున్నారు. కరోనా గ్యాప్‌ తరువాత తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను… తన స్టైల్లో ఎంటర్ టైన్ చేసేందుకు వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)తో మే 12న వరల్డ్‌ వైడ్ థియేటర్లో సందడి చేసేందుకు వస్తున్నాడు. మహేష్ తనలోని సరికొత్తకోణాన్ని చూపించనున్న సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే అదిరిపోయే పాటలు, గూస్ బంప్స్ తెప్పించే టీజర్.. ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిన ట్రైలర్ ప్రేక్షకుల ముందు వచ్చేశాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మే 7న హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అయితే ఇప్పటికే సర్కారు ఊర మాస్ ట్రైలర్ తో రికార్డులను కొల్లగొడుతున్న ప్రిన్స్ మహేష్.. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే మరో రేర్‌ ఫీట్ ను టచ్ చేశారు. ఓవర్‌ సీస్‌ మార్కెట్ లో కీ రోల్‌ ప్లే చేసే USAలో అత్యధికంగా 605 థియేటర్లలో రిలీజ్‌ కాబోతున్నాడు మన సూపర్ స్టార్. అయితే నాన్ పాన్ ఇండియా సినిమాల్లో ఓ సినిమా ఈ రేంజ్లో .. అదీ ఓవర్‌సీస్‌లో రిలీజవ్వడం ఓ రికార్డే అని క్రిటిక్స్ అంటున్నారు. అనడమే కాదు ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈవిషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ ‘సర్కారు అప్పుడే అమెరికాలో రికార్డ్‌ క్రియేట్ చేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు, మీమ్స్‌తో ఈ రేర్‌ ఫీట్‌ ను పబ్లిసైజ్‌ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..