Sarkaru Vaari Paata : దూకుడు పెంచిన మహేష్.. సూపర్ స్పీడ్‌లో సర్కారు వారిపాట షూటింగ్..

|

Sep 16, 2021 | 7:59 AM

సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Sarkaru Vaari Paata : దూకుడు పెంచిన మహేష్.. సూపర్ స్పీడ్‌లో సర్కారు వారిపాట షూటింగ్..
Mahesh
Follow us on

Sarkaru Vaari Paata : సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ కూడా ఈ మూవీలో మరింత స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నామధ్య దుబాయ్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఆతర్వాత కొద్దిరోజులు హైదరాబాద్‌లో షూట్ చేశారు. ఆ తర్వాత గోవాకు వెళ్లారు చిత్రయూనిట్. ఇప్పుడు గోవా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో మహేష్ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా శరవేగంగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారట మహేష్. ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా మహేష్ బాబు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు విరామం లేకుండా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి సినిమా విడుదల అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది..దాంతో ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేలా షూటింగ్ లో స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. కరోనా వల్ల రెండేళ్ల గ్యాప్ వచ్చిన మహేష్ బాబు మరో సక్సెస్‌ను సర్కారు వారి పాట సినిమాతో కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలోపూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ నటించనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..

Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో..

Shah Rukh Khan-Atlee: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేసే సినిమా టైటిల్ ఇదేనా..?