Katha Venuka Katha: కథ వెనక కథ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కథ.. కథనంలో కొత్తదనం ఉంటే చాలు అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘కథ వెనుక కథ’ కూడా అంతే.. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

Katha Venuka Katha: కథ వెనక కథ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Katha Venuka Katha
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 30, 2024 | 5:43 PM

మూవీ రివ్యూ: కథ వెనక కథ

నటీనటులు: సునీల్, విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫర్: గంగనమోని శేఖర్, ఈశ్వర్

ఎడిటర్: అమర్ రెడ్డి

నిర్మాత: అవనీంద్రకుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కృష్ణ చైతన్య

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కథ… కథనంలో కొత్తదనం ఉంటే చాలు అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘కథ వెనుక కథ’ కూడా అంతే.. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ:

సినిమా డైరెక్టర్ కావాలని హీరో కల. హీరో తన మరదలిని పెళ్ళి చేసుకోవాలంటే కచ్చితంగా హిట్ కొట్టాలి అని షరతు పెడతాడు మేనమామ. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఒక సినిమా అవకాశం తెచ్చుకుంటాడు. తర్వాత సిటీలో ఒక గ్యాంగ్ కొంతమంది అమ్మాయిలను హత్య చేస్తుంటారు. ఆ గ్యాంగ్‌ని పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు అధికారులు. అదే సమయంలో హీరో సినిమాకి ఒక సమస్య వస్తుంది. ఇక ఎంక్వయిరీ, కేసులు అంటూ కథ ముందుకు నడుస్తుంది..

కథనం:

ఒక క్రైమ్‌తో సినిమా మొదలవుతుంది. తర్వాత హీరో సినిమా ప్రయాణంతో సినిమా ముందుకు వెళుతుంది. మధ్యలో హీరో డైరక్షన్ చేస్తున్న సినిమాకి సమస్య రావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పటి నుంచి నుంచి కథనాన్ని ఆసక్తిగా నడిపిస్తాడు దర్శకుడు. మధ్యలో ఐటం సాంగ్ మాత్రం అనవసరంగా అనిపిస్తుంది. ఏదో ఫోర్స్‌గా ప్లేస్మెంట్ చేసినట్టు ఉంటుంది. అది తప్ప ఇక ఎక్కడ బోర్ కొట్టకుండా సస్పెన్స్‌తో ముందు వెళుతుంది. కాకపోతే అక్కడక్కడ కథ నెమ్మది అవుతుంది. అలాగే ఒక చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌కి చేరుకుంటుంది. ఇక సెకండాఫ్ మరింత ఆసక్తికరంగా మొదలవుతుంది. పోలీస్ ఎంక్వయిరీ, అమ్మాయిల హత్యలు, ఆ గ్యాంగ్ ఎవరు, హీరోకి జరుగుతున్న హత్యలకు సంబంధం ఏంటి.. హీరో తీస్తున్న సినిమా పరిస్థితి ఏంటి.. ఇలా చాలా మలుపుల మధ్య కథ ముందుకు సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్‌కి కావాల్సింది ప్రేక్షకుడు షాక్ అయ్యే ట్విస్ట్‌లు. అది దర్శకుడు చైతన్య బాగా గ్రహించి దానికి తగ్గట్టుగానే మంచి ట్విస్ట్‌లు రాసుకున్నాడు. అవి బాగా వర్కవుట్ అయ్యాయి కూడా. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా తను అనుకొన్నట్టుగానే సినిమాని సస్పెన్స్‌గానే తీశాడు.

నటీనటులు:

ఇందులో నటించిన హీరో అశ్విన్.. దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో బాగా నటించారు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన ఉన్న ఓ బాధ్యతాయుతమైన యువకుని పాత్ర బాగుంది. కమెడియన్ సునీల్ క్యారెక్టర్ చాలా సర్ ప్రైజ్ ఇస్తుంది. వైవిధ్యమైన పాత్రలో సునీల్ కనిపించి మెప్పించాడు. సత్యం రాజేష్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. సీనియర్ నటుడు జయప్రకాశ్ ఇందులో సినీ నిర్మాతగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం పర్లేదు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. దర్శకుడు రాసుకున్న కథ ఓకే అనిపిస్తుంది.

పంచ్ లైన్:

కథ వెనక కథ.. వీకెండ్‌లో చూసే డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్