
A1 Express Movie : యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం సంపాదించుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో మార్చి 5న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్ త్వరలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా శుక్రవారం(మార్చి 5న )ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
ఈ సినిమా ఎలా ఉందంటే.. హాకీ కి చెందిన ప్లేగ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథంతా.. ఆ గ్రౌండ్ ను కాపడుకునేందుకు ప్రయత్నించే ఓ కోచ్ ఆ కోచ్ కు ఓ హాకీ ఆటగాడు సాయపడుతుంటాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా నటించాడు. అయితే హాకీ నుంచి సందీప్ నిషేదించబడాతాడు. సందీప్ ను ఎందుకు నిషేదించారు. మళ్లితిరిగి హాకీ ఆడతాడా అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది. హీరో హీరోయిన్లు ఎలా నటించారు అనే దానిపై కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :