
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అందాల భామ ఖుష్భు.. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఖుష్భు.. అలాగే పలు టీవీ షోల్లో జడ్జ్ గాను వ్యవహరిస్తున్నారు. ఖుష్భు భర్త గురించి చాలా మందికి తెలియక పోవచ్చు ఆయన మరెవరో కాదు ప్రముఖ నటుడు, నిర్మాత సుందర్ సి. ఈయన హారర్ నేపథ్యంలో తెరకెక్కిన అరణ్మనై సినిమాల్లో నటిస్తూ.. నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ సిరీస్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు అరణ్మనై 4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు బాక్ అనే టైటిల్ ను పెట్టారు.
ఈ సినిమాలో రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ రోజే( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ పాల్గొంటున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుందర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య ఖుష్భు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. తనకు పిల్లలు పుట్టరని తెలిసి ఖుష్భు చాలా కుమిలిపోయిందని అన్నారు. సుందర్ సి మాట్లాడుతూ..
నేను చెప్పేది పెళ్ళికి ముందు జరిగిన విషయం. అప్పుడు ఖుష్బూ అనారోగ్యానికి గురైంది. అయితే ఆమెకు పిల్లలు పుట్టరని ఓ వైద్యుడు మాతో అన్నడు. అని విని ఎంతో బాధపడింది. తనలో తానే కుమిలిపోయింది. అప్పుడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడ్చింది. కానీ నేను పిల్లలు పుట్టక పోయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మమ్మల్ని దేవుడు మరోలా దీవించాడు. మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.