Sumanth: ఆ విషయం గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను.. హీరో సుమంత్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలను అందుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వచ్చినప్పటికీ.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఒకప్పుడు హీరోలుగా అలరించిన తారలు.. ఇప్పుడు విలన్ పాత్రలతో పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో సుమంత్ ఒకరు.

Sumanth: ఆ విషయం గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను.. హీరో సుమంత్ కామెంట్స్..
Sumanth

Updated on: Jan 10, 2026 | 12:34 PM

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హీరో సుమంత్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఒకప్పుడు ప్రేమకథలతో ఆకట్టుకున్నాడు. అప్పట్లో సుమంత్ నటించిన ప్రేమకథ, సత్యం వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తాడనుకుంటే అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలా కాలం పాటు సైలెంట్ అయిన సుమంత్.. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పట్లో హీరోగా మెప్పించిన సుమంత్.. ఇప్పుడు సినిమాల్లో సహయ పాత్రలు, విలన్ రోల్స్ పోషిస్తూ అలరిస్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. సీతారామం సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. అయితే ఓ సినిమా విషయంలో మాత్రం సుమంత్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడట. ఆ సినిమా మరేదో కాదు.. నువ్వే కావాలి.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

నువ్వే కావాలి సినిమా ఛాయిస్ తనకే వచ్చిందని అన్నారు. కథ విన్నానని.. నచ్చిందని.. కానీ ఎందుకో తాను చేయలేకపోయానని అన్నారు. ఆ తర్వాత ఆ సినిమా చాలా పెద్ద హిట్టయ్యిందని.. రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి కథను మిస్ చేసుకున్నానని తను చాలా సార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆ ఫీలింగ్ తనకు ఉంటుందని అన్నారు. సుమంత్ మిస్ చేసుకున్న నువ్వే కావాలి సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

2000 సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయింది నువ్వే కావాలి సినిమా. డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటగ్ పనిచేశారు. ఇందులో త్రివిక్రమ్, రిచా జంటగా నటించారు. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..