
ఓటీటీలో సినిమాల సందడి ఎలా ఉన్నటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాలన్నీ నెల రోజుల వ్యవధిలో ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో అలరించాయి. ఇప్పుడు మరో రీసెంట్ రిలీజ్ మూవీ ఓటీటీలో రానుంది. ఆ సినిమానే రామ్ పోతినేని నటించిన స్కంద. టాలీవుడ్ లో మాస్ దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి తెరకెక్కించిన సినిమా స్కంద. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.
కానీ ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ స్కంద సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.
రామ్ పోతినేని స్కంద సినిమా డిస్ని హాట్ స్టారర్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అక్టోబర్ 27న స్కంద సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి స్కంద సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
& Now.. #Skanda is all yours! 🤗
Love..#RAPO pic.twitter.com/UHsJIi9Fj8
— RAm POthineni (@ramsayz) September 27, 2023
#Skanda release trailer is a feast for the masses. @ramsayz is going to rock with performance and dialogue delivery! 🔥 pic.twitter.com/tVdi3rBgLe
— idlebrain jeevi (@idlebrainjeevi) September 25, 2023
Chuskundaam…Baraabar Chuskundaam! #SKANDA RELEASE TRAILER https://t.co/sHed5UgBhb pic.twitter.com/js5fH021R4
— RAm POthineni (@ramsayz) September 25, 2023
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..