Natural Star Nani: నేచురల్ స్టార్‌ నానితో సినిమాకు నో చెప్పిన స్టార్ హీరోయిన్! కారణం తెలుసా

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకే నానితో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి ..

Natural Star Nani: నేచురల్ స్టార్‌ నానితో సినిమాకు నో చెప్పిన స్టార్ హీరోయిన్! కారణం తెలుసా
Bollywood Heroine And Nani

Updated on: Dec 23, 2025 | 6:15 AM

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకే నానితో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, తాజాగా నాని నటిస్తున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఒక క్రేజీ భామ నో చెప్పిందనే వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ ఆఫర్ వచ్చినప్పటికీ, ఆమె ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

క్రేజీ కాంబినేషన్ మిస్!

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ద పారడైజ్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక స్టార్ కిడ్ కోసం ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే టాలీవుడ్‌లో ఒక టాప్ హీరో సరసన నటించి మెప్పించిన ఈ భామ, తెలుగులో మరో మంచి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. అయితే, దర్శకుడు చెప్పిన కథ ఆమెకు నచ్చినప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Jahnvi Kapoor

ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్టులతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సానా సినిమాలో నటిస్తున్న ఈ చిన్నది, హిందీలో వరుణ్ ధావన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండటంతో, కొత్తగా మరో భారీ ప్రాజెక్టుకు సంతకం చేస్తే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని ఆమె భావించిందట. అందుకే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తన నటనతో అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, నాని సరసన నటిస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె ఈ ప్రాజెక్టుకు నో చెప్పడంతో, చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టింది. నాని, జాన్వీ కాంబినేషన్ చూడాలని ఆశపడ్డ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. అయితే భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందేమో చూడాలి.