Rajamouli: ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ఘనత.. గ్రేట్ జేమ్స్ కామెరాన్ ను కలిసిన ఎస్ఎస్ రాజమౌళి..

| Edited By: Ravi Kiran

Jan 19, 2023 | 8:24 AM

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్.

Rajamouli: ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ఘనత.. గ్రేట్ జేమ్స్ కామెరాన్ ను కలిసిన ఎస్ఎస్ రాజమౌళి..
Rajamouli
Follow us on

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో..నాటు నాటు సాంగ్‌ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు..బెస్ట్‌ సాంగ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి..అతిరథ మహారథుల మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ పాటలో రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న RRR..ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది.

తాజాగా దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమరూన్ ను కలిశారు. జేమ్స్ కెమరూన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినఅవరసం లేదు. టైటానిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జెమ్స్. ఆ తర్వాత అవతార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.

అలాగే ఇప్పుడు అవతార్ 2తో మరో సెన్సేషనల్ హిట్ ను తన ఖాతలో వేసుకున్నారు. అంతటి దిగ్గజ దర్శకుడు .. తాజాగా రాజమోళిని కలిశారు. ఆ విషాయాన్ని తెలుపుతూ.. ట్వీట్ చేశారు రాజమౌళి. గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. ‘సర్ మీరు మాతో 10 నిమిషాల సమయం కేటాయించడం.. మా సినిమా గురించి విశ్లేషిస్తారని అనుకోలేదు. మీరన్నట్టు, నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు జక్కన్న.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..