కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఆదుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత స్టార్ మహేష్ బాబు -వెంకటేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అఆతర్వాత శ్రీకాంత్ అడ్డాల కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. బ్రహ్మోత్సవం సినిమా అనే భారీ సినిమా చేసాడు. కానీ ఆ సినిమా అంతే భారీగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పడు వెంకటేష్ తో నారప్ప సినిమా చేస్తున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’ కి రీమేక్. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే బలమైన నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ‘కర్ణన్’ రీమేక్ హక్కులను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన శ్రీకాంత్ అడ్డాలకే ఇచ్చారని తెలుస్తుంది.
ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల మరో సినిమాకు సిద్దమవుతున్నదని తెలుస్తుంది. ఈ సారి ఈ దర్శకుడు పవర్ స్టార్ .పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ‘వకీల్ సాబ్’ హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తరువాత సినిమాకి కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు ఇవ్వాలని చూస్తున్నాడని టాక్ నడుస్తుంది. పవన్ కోసం ఓ స్టోరీని కూడా సిద్ధం చేయమని చెప్పాడట దిల్ రాజు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అదే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :