శ్రీదేవి వర్ధంతి: అనంత లోకాలకు అతిలోక సుందరి.. నేటికి మూడేళ్ళు పూర్తి.. ‘దేవత’ జ్ఞాపకాలతో స్పెషల్ స్టోరీ..

|

Feb 24, 2021 | 10:35 AM

అతిలోక సుందరి అనగానే గుర్తుకువచ్చే పేరు శ్రీదేవి. అందుకు తగ్గట్టుగానే అందం ఆమెది. తెలుగు, తమిళం, హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు శ్రీదేవి.

శ్రీదేవి వర్ధంతి: అనంత లోకాలకు అతిలోక సుందరి.. నేటికి మూడేళ్ళు పూర్తి.. దేవత జ్ఞాపకాలతో స్పెషల్ స్టోరీ..
Follow us on

అతిలోక సుందరి అనగానే గుర్తుకువచ్చే పేరు శ్రీదేవి. అందుకు తగ్గట్టుగానే అందం ఆమెది. తెలుగు, తమిళం, హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు శ్రీదేవి. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అలనాటి సీనియర్ హీరోల సరసన హీరోయిన్‏గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అతిచిన్న వయసులోనే హీరోయిన్‏గా మారి తక్కువ సమయంలోనే అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఆ అతిలోక సుందరి శ్రీదేవి దివికేగి నేటికి మూడేళ్ళవుతోంది. నేడు శ్రీదేవి వర్ధంతి. అంతటి మనోహర రూపాన్ని తలచుకుంటూ శ్రీదేవి స్పెషల్ స్టోరీ..

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శ్రీదేవి. పదహారేళ్ళు దాటకముందే అలనాటి అగ్రహీరోలకు జోడీగా హీరోయిన్‏గా మారిపోయింది. ‘అనురాగాలు’లో సినిమా సెకండ్ హీరోయిన్‏గా నటించడమే కాకుండా.. ‘దేవుడులాంటి మనిషి’లో రాజబాబుకు జంటగా నటించింది. ఆ సినిమాల తర్వాత కాస్త సమయం తీసుకున్న శ్రీదేవి.. దాసరి నారాయణరావు ‘మా బంగారక్క’ సినిమాలో హీరోయిన్‏గా అరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత శ్రీదేవి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తమిళంలో ‘పదునారు వయదినిలై’లో నటించిన శ్రీదేవి మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాను కె.రాఘవేంద్రరావు తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా శ్రీదేవినే హీరోయిన్‏గా హీరోయిన్ గా చేసింది. అందులో శ్రీదేవి నటన ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

టాప్ హీరోయిన్‏గా శ్రీదేవి మారడానికి ఒకందుకు రాఘవేంద్రరావు గారు చూపించిన తీరు కూడా కావచ్చని చెప్పుకోవచ్చు. యన్టీఆర్‏తో రాఘవేంద్రరావు రూపొందించిన ‘వేటగాడు’లో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా అంతకు ముందే 1972లో యన్టీఆర్ ‘బడిపంతులు’లో ఆమె మనవరాలుగా నటించింది. మనవరాలుగా నటించి మళ్లీ అదే హీరోకు జోడిగా నటించిన హీరోయిన్ ఎవరయిన ఉన్నారంటే అది శ్రీదేవి మాత్రమే. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన వేటగాడు సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవిల జంట ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దీంతో వరుసగా నాలుగు సంవత్సరాలు ఈ జంట నటించిన చిత్రాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రాఘవేంద్రరావు తెలుగులో తెరకెక్కించిన ‘పదహారేళ్ళ వయసు’ను హిందీలో ‘సోల్వా సావన్’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా శ్రీదేవినే నాయిక. కానీ అక్కడ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‏లో శ్రీదేవికి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తెలుగులో విజయం సాధించిన ‘ఊరికి మొనగాడు’ చిత్రాన్ని హిందీలో కృస్ణ, ఆయన సోదరులు ‘హిమ్మత్ వాలా’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీదేవిని రాఘవేంద్రగారు చూపించిన తీరు అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి వరుస ఆఫర్లను అందుకుంది. అప్పటివరకు హీరోయిన్ పాత్రలో మాత్రమే నటిస్తున్న శ్రీదేవిలోని సరికొత్త బయటకు తీశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. విక్టరి వెంకటేష్ ప్రధాన పాత్రలో ఆర్జీవి తెరకెక్కించిన క్షణ క్షణం సినిమాలో శ్రీదేవి విభిన్నపాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా శ్రీదేవికి ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. హీరోయిన్‏గా ఫుల్ జోరు మీదున్న సమయంలోనే శ్రీదేవి బాలీవుడ్ హీరో బోనీ కపూర్‏ను వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కెమెరాకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్లీ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో రీఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి తన ‘బాహుబలి’లో తొలుత శ్రీదేవిని శివగామి పాత్రకు ఎంచుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్ర శ్రీదేవి చేజారిపోయింది. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘పులి’లో శ్రీదేవి నటించింది. కానీ ఆ సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత ‘మామ్’గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాతో శ్రీదేవికి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆ తర్వాత శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనుమానస్పద రీతిలో కన్నుమూసింది. నేటికి అతిలోక సుందరి అనంతలోకాలకేగి ఇప్పటికీ మూడేళ్ళు గడుస్తున్న ఆమెను గుర్తుచేసుకోనివారుండరు.

Also Read:

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్‏గా.. సహజ నటనతో పక్కింటి అబ్బాయిగా.. నాని లైఫ్ స్పెషల్ స్టోరీ..