వర్మ, శ్రీరెడ్డి.. ఇద్దరికీ ఇద్దరే. వివాదాలు సృష్టించడంలోనూ.. ఎదుటివారిని టార్గెట్ చేయడంలోనూ.. ఇద్దరూ ముందే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా.. పోస్ట్‌లు పెడుతూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది కూడా వీళ్లే. మరి వీరిద్దరూ ఒక్కటైతే.. ఆ కాంబో ఎలా ఉంటుంది? ఊహించడానికే.. కాస్త కష్టం కదా..! కానీ.. శ్రీరెడ్డి.. వర్మను డేటింగ్‌కు ఆహ్వానించింది. ఏంటి షాక్ అయ్యారా..? అవును అది కూడా పబ్లిక్‌గా.. ఫేస్ బుక్‌లో పోస్ట్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చనే సాగుతోంది.
ఇన్నాళ్లూ లేనిది వర్మ ఇప్పుడే.. శ్రీరెడ్డికి ఎందుకు గుర్తొచ్చాడు..? ఆయన్ని డేటింగ్‌కి ఆహ్వానించడానికి అసలు రీజన్ ఏంటి..? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. కాగా.. ఈ మధ్య ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌తో ఏపీలో.. మరిన్ని వివాదాలకు ఆజ్యం పోశాడు వర్మ. గత కొద్ది రోజులుగా.. ఈ సినిమాపై రగడ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. వర్మ బాగా ట్రోల్ అవుతున్నాడు. ఈ సందర్భంలో.. శ్రీరెడ్డి.. వర్మను డేటింగ్‌కు ఆహ్వానించడం చూస్తుంటే.. ఏదో మెలిక పెట్టే పనిలో ఉందనే అనిపిస్తోంది.
ఏదేమైనా.. ఇలా పబ్లిక్‌గా ‘ఐ వానే డేట్ విత్ యూ రామ్ గోపాల్ వర్మ’ అంటూ ఓ పెద్ద పోస్ట్‌నే పోస్ట్ చేసింది. ఇన్ని రోజులూ లేనిది సడన్‌గా వర్మ ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చాడని.. నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే.. వర్మతో కలిసి మళ్లీ ఫేమ్ సంపాదించాలని.. ఆమె అనుకుంటున్నట్లు.. పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. మరి శ్రీరెడ్డి కామెంట్స్‌పై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడనేది చూడాలి.