SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్

SP Balasubrahmanyam: ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం గత ఏడాది కరోనా తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 2020, 21 సంవత్సరాల..

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్
Sp Balasubrahmanyam

Updated on: Nov 09, 2021 | 9:27 PM

SP Balasubrahmanyam: ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం గత ఏడాది కరోనా తో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  2020, 21 సంవత్సరాల పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా ఎస్పీబీకి కేంద్ర ప్రభుత్వం మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం పద్మ విభూషణ్ తో సత్కరించింది . ఇవాళ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి తరఫున పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా గాయకుడి తనయుడు ఎస్పీ చరణ్ అవార్డును అందుకున్నారు.

2020, 21 సంవత్సరాలకు గాను పద్మ పురస్కారాలను రెండ్రోజులుగా నాలుగు విడతల్లో ప్రధానం చేస్తున్నారు. ఎస్పీ బాలు (74) గతేడాది కరోనా బారినపడి .. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత చలన చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలుది గాయకుడిగా ప్రత్యేక స్థానం. అగ్రశ్రేణి నేపధ్య గాయకుడిగా సుమారు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలను బాలు పాడారు. అయన కెరీర్ లో అనేక అవార్డులతో పాటు రివార్డులను కూడా అందుకున్నారు. ఇక బాలసుబ్రమణ్యం ను   2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. ఇక ఎస్పీ చరణ్ పద్మభూషణ్ అవార్డు ను అందుకుంటున్న ఫోటోని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.

Also Read:   చెన్నైలోని వరద బాధితులకు అమ్మ క్యాంటీన్ల నుంచి ఉచితంగా ఆహారాన్ని అందించనున్న ప్రభుత్వం..