అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే అదే బ్రాండ్‌కు అంబాసిడర్ ఈ భామ..

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. కేవలం అందంతోనే కాదు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకప్పుడు అంశంగా లేదని రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే స్టార్ గా మారింది.

అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే అదే బ్రాండ్‌కు అంబాసిడర్ ఈ భామ..
Actress

Updated on: Oct 01, 2025 | 8:24 AM

చాలా మంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది సైడ్ డ్యాన్సర్లు గా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు అందంగా లేవు అంటూ అవమానించారు. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు ఆమె ఓ స్టార్ హీరో భార్య కూడా.. ఇప్పుడు మీ ఆస్థి కొన్ని వందల కోట్లు.. కెరీర్ బిగినింగ్ లో ఓ యాడ్ షూట్ కోసం ఆడిషన్ ఇస్తే అందంగా లేవు అంటూ అవమానించారు. ఇప్పుడు అదే బ్రాండ్ కు ఆమె అంబాసిడర్.

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం పీక్. ఆమె ఎవరో కాదు అందాల భామ శోభిత దూళిపాళ్ల.  డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. అంతకు ముందు గూఢచారి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గతంలో శోభితా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి..

తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది శోభిత. ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదని తెలిపింది.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు తాను బ్రాండ్ అంబాసిడర్‏గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది. శోభితా మాట్లాడుతూ.. “నేను అందంగా.. ఆకర్షణీయంగా లేనని నన్ను కేవలం బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు నేను బ్రాండ్ అంబాసిడర్‏గా సైన్ చేశాను. ఐశ్యర్య రాయ్ బచ్చన్‏తో షాంప్స్ యాడ్ కూడా చేశాను. చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఈ  కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.