Sobhita Dhulipala: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న శోభితా ధూళిపాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

పాన్ ఇండియా సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. అటు ఓటీటీలో వెబ్ సిరీస్.. ఇటు థియేటర్లలో సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తాజాగా శోభితా నటించిన లేటేస్ట్ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్

Sobhita Dhulipala: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న శోభితా ధూళిపాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Sobhita Dhulipala
Follow us

|

Updated on: Sep 10, 2024 | 9:39 PM

పాన్ ఇండియా సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. అటు ఓటీటీలో వెబ్ సిరీస్.. ఇటు థియేటర్లలో సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తాజాగా శోభితా నటించిన లేటేస్ట్ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ జీ5 వరుసగా కొత్త సినిమాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నటించిన లవ్ సితార సినిమాను కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకువస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంప్రదాయ వస్త్రధారణలో శోభితా నవ్వుతూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ వెల్లడించారు.

ఈ చిత్రం రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్నట్లు తెలుస్తోంది. లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించిన కథ ఇది. సెప్టెంబర్ 27న లవ్ సితార జీ5లో ప్రీమియర్ కానుంది. వందన్ కటారియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభితాతోపాటు శంకర్ చంద్రఛూడన్, రిజుల్ రే, సీమా సాన్వీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

నిజానికి ఈ సినిమా షూటింగ్ 2020లోనే మొదలైంది. కానీ కరోనా లాక్ డౌన్, మరిన్ని కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్వీపీ బ్యానర్ పై రోనీ స్క్రీవాలా నిర్మించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే హీరో అక్కినేని నాగచైతన్యతో శోభితా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహ జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.