Viral News: వామ్మో.. తాగుడు, తిండికి బానిసైన పిల్లి..! నడవలేని స్థితిలో ఇప్పుడిలా.. బరువెంతో తెలిస్తే..

కాగా, సోషల్ మీడియాలో ఈ పిల్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో ప్రజలు దీనిపై చాలా ప్రేమను కురిపిస్తున్నారు. కామెంట్స్‌లో పిల్లి ఆరోగ్యం గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రపంచంలోని ఐదు అత్యంత లావుగా ఉన్న పిల్లులలో ఒకటిగా గుర్తించారు. ఇక ఈ పిల్లిని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని అందించడం ద్వారా పిల్లి బరువును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Viral News: వామ్మో.. తాగుడు, తిండికి బానిసైన పిల్లి..! నడవలేని స్థితిలో ఇప్పుడిలా.. బరువెంతో తెలిస్తే..
Monster Cat
Follow us

|

Updated on: Sep 10, 2024 | 9:23 PM

చిన్న పిల్లల కంటే ఎక్కువ బరువున్న పిల్లి ఒకటి ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. అంతే కాదు, ఈ పిల్లి మద్యం కూడా తాగుతుంది. తినడానికి, తాగడానికి ఇష్టపడే ఈ పిల్లి బరువు 17 కిలోలు. ఈ పిల్లి అధిక బరువు కారణంగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక NGO దానిని రక్షించింది. ఈ కేసు రష్యాకు చెందినదిగా తెలిసింది. ఈ పిల్లిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ పిల్లి మద్యం, జ్యూస్, మాంసం, సూప్, బ్రెడ్ చాలా ఇష్టంతో తింటుంది. తాగుతుంది. ఆస్పత్రిలో పిల్లికి అల్ట్రాసౌండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సెన్సార్లు ఆ పల్లిని స్కాన్ చేయలేకపోయాయని వైద్యులు వెల్లడించారు.

ఈ పిల్లి పేరు క్రోషిక్. భారీ ఆకారం, అధిక బరువు కారణంగా ఈ పిల్లి మాన్స్టర్ క్యాట్ పేరుతో ఇంటర్నెట్‌లో ఫేమస్‌గా మారింది. ఇప్పుడు NGO పిల్లిని ఆహారం, చికిత్స ద్వారా నడవగలిగేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. చికిత్సతో ఆ పిల్లి ఇప్పుడు తన కాళ్ళను కదిలించడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో పిల్లి నేలపై పాకుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ పిల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి సెల్లార్‌లో వదిలివెళ్లిపోయారు. పిల్లి పేరు క్రోషిక్ అని పెట్టారు. కొన్నాళ్లుగా ఈ పిల్లి ఇక్కడే నివసిస్తోందని, ఎవరో కావాలనే దీనిని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. పిల్లి రంగు గోధుమ మరియు తెలుపు. ప్రస్తుతం పశువైద్యులు ఈ పిల్లికి చికిత్స అందజేస్తున్నారు. పిల్లి బరువు దాని గుండె, ఇతర శరీర అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేదానిపై ఇంకా రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది.

కాగా, సోషల్ మీడియాలో ఈ పిల్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో ప్రజలు దీనిపై చాలా ప్రేమను కురిపిస్తున్నారు. కామెంట్స్‌లో పిల్లి ఆరోగ్యం గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రపంచంలోని ఐదు అత్యంత లావుగా ఉన్న పిల్లులలో ఒకటిగా గుర్తించారు. ఇక ఈ పిల్లిని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని అందించడం ద్వారా పిల్లి బరువును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..