చీరకట్టులో జాన్వీ.. అందాలు చూస్తే కుర్రకారుకు కిర్రెక్కాల్సిందే

Phani CH

10 SEp 2024

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

తెలుగులో కూడా 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ఈ బ్యూటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం దేవర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. దీనికోసం ఎన్టీఆర్, కొరటాల శివ ఇలా అందరూ ముంబైకి వెళ్లారు. 

ఈ ట్రైలర్ లాంచ్ ప్రమోషన్స్ కోసం ఇలా జాన్వీ కపూర్ చీరకట్టులో మెప్పించేలా ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో జాన్వీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.