చిరంజీవికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఊహించలేరు

10 September 2024

Basha Shek

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే బుక్ లో మెగా స్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు

సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి నటనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ఆయన డ్యాన్స్ కు అంతకు మించి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

సినిమాల సంగతి పక్కన పెడితే చిరంజీవిని అందరూ అభిమానించడానికి ప్రత్యేక కారణం ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే.

మరి సినిమాల్లో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఇటీవలే ఒక సందర్భంలో దీని గురించి మాట్లాడారు చిరంజీవి. దివంగత సౌందర్య, రాధిక, రాధ తనకు ఇష్టమైన హీరోయిన్లు అన్నారు.

సౌందర్య ప్రవర్తించే తీరు, మాట్లాడే పద్ధతి కానీ, అన్నీ ఎంతో చక్కగా ఉంటాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.  ఆమెతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందన్నారు.

ఇక మెగాస్టార్‌కు ఇష్టమైన హీరో విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ అన్నారు. అతని నటన అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.