బుల్లితెర‌ నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్..!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వీర‌విహారం చేస్తోన్న క‌రోనావైర‌స్ తాజాగా బుల్లితెర‌పై త‌న ప్ర‌తాపం చూపుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్మాల్ స్క్రీన్ యాక్ట‌ర్స్ క‌రోనా బారినప‌డ‌గా..తాజాగా మ‌రో న‌ట‌డు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

బుల్లితెర‌ నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్..!

Updated on: Jul 04, 2020 | 7:17 AM

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వీర‌విహారం చేస్తోన్న క‌రోనావైర‌స్ తాజాగా బుల్లితెర‌పై త‌న ప్ర‌తాపం చూపుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్మాల్ స్క్రీన్ యాక్ట‌ర్స్ క‌రోనా బారినప‌డ‌గా..తాజాగా మ‌రో న‌ట‌డు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న ‘నెంబర్‌ 1 కోడలు’, ‘అక్క మొగుడు’, ‘మౌనరాగం’ సీరియల్స్‌లో నటిస్తున్న శివకు క‌రోనా‌ పాజిటివ్‌గా నిర్దార‌ణ అవ్వ‌డంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. ఇటీవ‌లే షూటింగులు ప్రారంభించ‌గా వరుసగా న‌టీన‌టుల‌కి క‌రోనా సోకుతుండటంతో నిర్మాతలు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..క‌రోనా వ‌ద‌ల‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌ పరిస్థితుల్లో షూటింగ్‌కు రావాలో.. మ‌రికొంత‌కాలం గ్యాప్ తీసుకోవాలో తెలియ‌క‌ టీవీ నటులు గంద‌ర‌గోళంలో ఉన్నారు. కాగా ఇప్పటికే ఇద్దరు సీనియ‌ర్ టీవీ నటులు సహా.. ‘ఆమె కథ’ సీరియల్ లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న నవ్య స్వామి కరోనా బారిన ప‌డ్డారు. ఈ క్రమంలో సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నవ్య.. తాను ధైర్యంగా క‌రోనాతో పోరాడతానని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.