Sirivennela : ఎంత గొప్పగా చెప్పారు సర్.. ప్రతి అమ్మాయికి నచ్చే సాంగ్.. వింటే ఫిదా కావాల్సిందే..

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. ప్రతి సందర్భాన్ని ఎంతో అందంగా వర్ణించడంలో.. మనసును హత్తుకునే సాహిత్యాన్ని అందించడంలో ఆయనకు సాటిలేరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను రాసిన పాటలకు అర్ధాన్ని ఎంతో అందంగా వివరించారు. అలాగే ప్రతి అమ్మాయికి నచ్చే ఈ పాట గురించి తెలుసుకుందామా.

Sirivennela : ఎంత గొప్పగా చెప్పారు సర్.. ప్రతి అమ్మాయికి నచ్చే సాంగ్.. వింటే ఫిదా కావాల్సిందే..
Sirivennela

Updated on: Apr 18, 2026 | 12:03 PM

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ స్వర్ణ కమలం. 1988లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, భారతీయ శాస్త్రీయ నృత్యం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక ఇందులోని సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పాట ఓ అద్భుతమనే చెప్పాలి. అందులో కొత్తగా రెక్కలొచ్చెన. గతంలో ఈ పాటపై సిరివెన్నెల సీతారామశాస్త్రి విశ్లేషణ, ఆయన కవితా దృక్పథాన్ని, కే. విశ్వనాథ్ చిత్రాల ప్రత్యేకతలను తెలియజేస్తుంది. ఈ పాటకు అర్థాన్ని ఎంతో అందంగా వివరించారు సిరివెన్నెల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. “కొండదారి మార్చింది కొంటెవాగు జోరు” అనే వాక్యం, ఆ వెంటనే వచ్చే “కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు” అనే పదబంధం ఒక యువతి జీవితంలో ప్రేమ, స్నేహం, సాహచర్యం తీసుకువచ్చిన మార్పులను సూచిస్తాయని సీతారామశాస్త్రి వివరించారు. ఇది కేవలం ప్రేరణ కాదని, తనతో జీవితాంతం సాగే ఒక ప్రయాణాన్ని అందించే తోడును ఆమె గుర్తించిందని చెప్పారు. అయితే, స్త్రీ సహజమైన బిడియం కారణంగా ఈ భావాలను ఆమె స్పష్టంగా వ్యక్తపరచలేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

వర్షపు చినుకులు బండల మీద నుండి ప్రవహించి ఏరుగా మారినప్పుడు “కులుకులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యం లాగా మారుతుంది” అని ఆయన ప్రకృతిని కవిత్వంతో పోల్చారు. ఇది ఆ అమ్మాయి “కంటగింపు చేసింది” అని చెప్పి, మరుసటి క్షణం “కంటికి ఇంపు చేస్తుంది” అని పేర్కొనడంలో ఉన్న భావనను వివరించారు. “వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి” అనే పంక్తిని వివరిస్తూ, గాలి వెదురులో ఒదిగినప్పుడు అది వేణునాదంగా, మధుర గానకేళిగా మారుతుందని, కానీ అంతకుముందు ఆ గాలి ఝంఝానిలంలా, చెవులకు హోరుగా, భయానకంగా ఉండేదని చెప్పారు. ఈ వెదురు అనేది స్నేహం, సహవాసం, స్వార్థం లేని అక్కరను సూచిస్తుందని, తన తండ్రి లేని లోటును తీర్చి, జీవితాంతం తోడుగా నిలిచే ఒక ఆధారాన్ని అమ్మాయి గుర్తించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

పదాల పొందిక, ఫోనెటిక్స్, అలంకారాలు కవిత్వానికి అందాన్నిస్తాయని అంగీకరిస్తూనే, “అందమైన జిలుగులు తీసేసినా నిసర్గ సౌందర్యం ఉండాలి” అని సిరివెన్నెల చెప్పారు. అలంకరణలతో వచ్చే అందం కాకుండా, సహజ సిద్ధమైన అందం ఎంత ముఖ్యమో వివరించారు. భాషలో రాయలేని భావాలను సైతం భాషలో రాసి చూపించడమే కవిత్వం అని ఆయన తెలియజేశారు.

ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..

Follow Us