Sirivennela Seetharama Sastri: మా బాధ్యతను పెంచింది.. మీరు చూపించిన ప్రేమను మర్చిపోలేం.. సిరివెన్నెల కుటుంబం ..

కష్టసమయంలో తమకు అండగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. మీడియాకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు

Sirivennela Seetharama Sastri: మా బాధ్యతను పెంచింది.. మీరు చూపించిన ప్రేమను మర్చిపోలేం.. సిరివెన్నెల కుటుంబం ..
Sirivennela

Updated on: Dec 02, 2021 | 8:12 PM

కష్టసమయంలో తమకు అండగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. మీడియాకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల పెద్ద కుమారుడు యోగేశ్వర శర్మ ట్విట్టర్ ఖాతాలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు.. మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రప్రభుత్వం మా నాన్నగారిపై ఎంతో గౌరవాన్ని చూపించింది. మా బాధ్యతను పెంచింది. ఆయన కుటుంబసభ్యులుగా మేము గర్విస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుతవాలు మాకు ఎక్కువగా సపోర్ట్ చేశాయి. నాన్నగారిని ఓ స్నేహితుడిగా.. గురువుగా.. గైడ్ గా భావించిన సినిమా, మీడియా మిత్రులు తమ ప్రేమను చాటారు. మాపై మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం అని ట్వీట్ చేశారు.

ట్వీట్..

తెలుగు పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యింది. అనారోగ్యంతో సిరివెన్నెల మృతి చెందడంతో సినీ ప్రముఖులు.. తెలుగు ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు. ఇక నిన్న జూబ్లీహిల్స్‏లోని మహా ప్రస్థానం స్మశాన వాటికలో కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు.. అభిమానుల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24న తీవ్ర అస్వస్థతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.

Also Read:  Pregnancy Care: గర్భధారణ సమయంలో చురుకుగా ఉంటే.. ప్రసవ సమయంలో శక్తివంతంగా ఉంటారు.. ప్రసవవేదన తగ్గుతుంది!

Omicron Variant In India: థర్డ్‌ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న ఒమిక్రాన్.. ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమేనా?