Singer Kalpana: వెంటిలేటర్‌పై సింగర్ కల్పన.. ఆస్పత్రికి సింగర్ సునీత, గీతా మాధురి.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం (మార్చి 04) తన ఇంట్లోనే నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. అయితే స్థానికులు ఆమెను గుర్తించి ఒక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Singer Kalpana: వెంటిలేటర్‌పై సింగర్ కల్పన.. ఆస్పత్రికి సింగర్ సునీత, గీతా మాధురి.. ఏమన్నారంటే?
Singer Kalpana, Sunitha

Updated on: Mar 05, 2025 | 8:33 AM

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించడంతో స్థానికులు ఆమెను హైదరాబాద్ నగరంలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారంటున్నారు. అటు కల్పన ఆత్మహత్యాయత్నానికి ఇంకా సరైన కారణాలు వెల్లడి కాలేదు. అయితే ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు కల్పన రెండో భర్త ప్రసాద్ ప్రభాకర్ ను విచారిస్తున్నారు. అయితే ఆయన కూడా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాల సేకరణకు ప్రసాద్‌ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మొబైల్ కూడా‌ స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలయగానే సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. సింగర్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత కల్పన చికిత్స పొందుతోన్న హాస్పిటల్‎కి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కల్పన కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు సునీత. సునీతతో పాటు గీతామాధురి, కారుణ్య తదితరులు కల్పనను పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

 హోలిస్టిక్ ఆస్పత్రిలో సింగర్ సునీత

 

సినీ కళామతల్లికి సుమారు 27 ఏళ్లుగా సేవలందిస్తున్నారు సింగర్ కల్పన. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చాలామంది లాగే ఈ సింగర్ వ్యక్తిగత జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. ఆమె 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఓ కుమార్తె(19) ఉంది. 2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్‌ ప్రభాకర్‌తో రెండో వివాహం జరిగింది. వీరిద్దరూ ఐదేళ్లుగా కేపీహెచ్‌బీలోని వర్టెక్స్‌ ప్రీ విలేజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.