బెంగాలీ ఎనర్జిటిక్ సింగర్ క్రిష్ణకుమార్ కున్నాత్(Singer KK).. ఆకస్మిక మృతి చెందారు. లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో వెళ్లిన ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు దగ్గరికొచ్చి కేకేను హాస్పిటల్‌కి తరలిస్తుండగానే ప్రాణాలొదిలేశారు. కేకే కన్నుమూత అటు బెంగాల్‌లోనే కాకుండా ప్లేబ్యాక్ సింగింగ్ కమ్యూనిటీ మొత్తాన్ని కదిలించింది. రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తరలించగా.. అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థీవ దేహానికి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదికలో మృతి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. అయితే, కేకే మృతికి సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కున్నాత్ సన్నిహితులు చెబుతున్నారు.
కేకే ఆసుపత్రికి చేరిన సమయంలో తల, ముఖంపై గాయం గుర్తులున్నట్లు సమాచారం. గాయం ఎలా అయ్యిందనే తెలియాల్సి ఉంది. గాయం కారణంగానే మృతి చెందారా? లేదంటే గుండెపోటుతో మృతి చెందారా? అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలిపోనున్నది. అటు… వేదిక మీద మితిమీరిన ఫాగ్ కూడా కేకే మృతికి కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
కోల్‌కతా జెసిపి (క్రైమ్) గ్రాండ్ హోటల్‌కు చేరుకుంది
గాయకుడు కెకె మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అదే సమయంలో గ్రాండ్ హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ (CCTV)ని పరిశీలించిన పోలీసులు హోటల్ సిబ్బందిని, ఈవెంట్ నిర్వాహకులను విచారించనున్నారు. కోల్‌కతా జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) మురళీధర్ శర్మ గాయకుడు కెకె బస చేసిన ఒబెరాయ్ గ్రాండ్‌కు రావడం కనిపించింది.
నిర్వాహకులకు ముందే చెప్పిన..
మంగళవారం కచేరీకి హాజరైన కొందరు శ్రోతలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ నజ్రుల్ మంచ్ ఆడిటోరియం కిక్కిరిసిపోయిందని.. ఎయిర్ కండిషన్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పారు. ఒక చెమటతో ఉన్న KK స్టేజ్‌పై వేడిని అనుభవిస్తున్నాడు. అతనిపై లైట్లు డిమ్ చేయమని నిర్వాహకులను కోరాడు. వేదిక చుట్టూ గుమికూడడంపై నిర్వాహకులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Kolkata, West Bengal | From ‘Tu Ashiqui Hai’ to ‘Pal’, list of KK’s timeless songs he performed at Nazrul Manch where he breathed his last, yesterday. pic.twitter.com/8OsMGQ3KXB
— ANI (@ANI) June 1, 2022
ఇదిలా ఉండగా.. కేకే కుటుంబ సభ్యులు ముంబై నుంచి కోల్‌కతాకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కేకే భౌతిక కాయాన్ని ముంబైకు తరలించనున్నారు. అయితే, విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గన్ సెల్యూట్ చేయనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
West Bengal to give gun salute to singer KK who passed away last night
Read @ANI Story | https://t.co/VhKQZxBBoM#KK #KKsinger #KKPassesAway #kkdeath pic.twitter.com/H2Hp40MHHN
— ANI Digital (@ani_digital) June 1, 2022
అందరూ తప్పక రండి.. నా పెర్ఫామెన్స్ చూడండి
అందరూ తప్పక రండి.. నా పెర్ఫామెన్స్ చూడండి అంటూ కేకే ఇచ్చిన చివరి వీడియో మెసేజ్ వైరల్ అవుతోంది. కోల్‌కతాలో పలానా ఆడిటోరియంలో పాడబోతున్నా.. విని తరించండి అంటూ కేకే చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ కంపోజింగ్‌లో కేకే పాడిన పాటలు సూపర్ క్రేజ్ సంపాదించాయి. హిందీలో ఓం శాంతి ఓం సినిమాలో పాడిన కుదా జానే.. వో లమ్హే మూవీలో క్యా ముజే ప్యార్ హై, ఆషికీ -2 లో పియా ఆయే, భజరంగీ బాయిజాన్‌లో తుజో మిలా… ఇలా బాలీవుడ్‌లో మోడ్రన్ క్లాసిక్స్‌కి మారు పేరయ్యారు కేకే.
తెలుగు స్టార్ హీరోలక్కూడా మోస్ట్ ఫేవరిట్ సింగర్ అయ్యారు క్రిష్ణకుమార్ కున్నాత్. పవన్, చిరంజీవి, మహేశ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాల్లో దాదాపుగా థీమ్ సాంగ్స్ అన్నీ కేకే పాడినవే. ఖుషీలో ఏ మేరా జహా, జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్, అతడు సినిమాలో అవును నిజం నువ్వంటే నాకిష్టం పాటలు.. కేకేను తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గర చేశాయి.
అద్భుతమైన సింగర్, మంచి మనిషి క్రిష్ణకుమార్ కున్నాథ్ మృతి తననెంతో కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. కేకే మరణవార్తతో గుండెలు బద్దలయ్యేంత పనయిందంటూ ట్వీట్ చేశారు. తన కోసం ఇంద్ర సినిమాలో కేకే పాడిన ‘దాయిదాయి దామ్మా’ పాటను గుర్తు చేసుకున్నారు. కేకే కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం ప్రకటించారు.
గత వారంలో ఇదే విధంగా స్టేజ్ మీదే మృతిచెందిన మలయాళీ సింగర్ ఎడవ బషీర్‌ని కూడా గుర్తు చేసుకుంటున్నారు సంగీత ప్రియులు. భీమాస్ బ్లూడైమండ్ ఆర్కెస్ట్రాలో పాట పాడుతూ… గుండెపోటొచ్చి కుప్పకూలిపోయారు బషీర్. 78 ఏళ్ల బషీర్‌ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయంది.