Chinmayi Sripada: ఇలాంటి మగాళ్లు నశించాలి.. సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్

స్టార్ సింగర్ చిన్మయి ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పాడిన సాంగ్స్ ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. ఆమె సింగర్ గానే కాదు చాలా మంది హీరోయిన్స్ కు వాయిస్ కూడా ఇచ్చారు. చిన్మయి పాటల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

Chinmayi Sripada: ఇలాంటి మగాళ్లు నశించాలి.. సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్
Chinmayi Sripada

Updated on: Nov 06, 2025 | 10:19 AM

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. అదే సమయంలో మీటూ, క్యాస్టింక్ కౌచ్ వంటి విషయాల్లో తన గొంతకను బలంగా వినిపించింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం ఆపడం లేదీ ట్యాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తన దైన శైలిలో గళం వినిపిస్తుంటుంది.కొన్ని సార్లు చిన్మయి పోస్టులు వివాదాలకు దారి తీస్తుంటాయి. విమర్శలు కూడా వస్తుంటాయి. అయితేనేం తన నమ్ముకున్న దారిలోనే బలంగా వెళుతోంది చిన్మయి. తాజాగా ఆమె చేసిన ఇప్పుడు వైరల్ గా మారాయి..

రీసెంట్ డేస్ లో ట్విట్టర్ వాడకం మరింత ఎక్కువైంది. సినీ సెలబ్రెటీలు , కొందరు ప్రముఖులు ట్విట్టర్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ కొందరు ఆకతాయిలో ఎక్స్ (ట్విట్టర్ )లో బూతులు మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఆడపిల్లల గురించి పిచ్చి వాగుడు వాగుతున్నారు. తాజాగా కొంతమంది అబ్బాయిలు ఓ గ్రూప్ గా క్రియేట్ అయ్యి పచ్చి బూతులు మాట్లాడారు. దీని పై సింగర్ చిన్మయి సీరియస్ అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పింది.

గౌరవనీయులైన సజ్జనార్ సర్.. దయచేసి దీన్ని గమనించండి. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వారు విస్మరించి వెళ్లిపోవచ్చు. నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి. ఈ వ్యక్తులు నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు. దయచేసి సహాయం చేయండి. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి