
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయిన సినిమాలు.. ఉత్తమ నటన కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు గౌరవంగా ఈ అవార్డ్స్ ఇస్తుంటారు. తాజాగా ఈ అవార్డ్స్ వేడుక 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 15న మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డ్స్ వేడుక పుర్తయ్యింది. ఇక ఈరోజు (సెప్టెంబర్ 16న) తమిళ్, మలయాళం ఇండస్ట్రీలోని సినిమాలు జరుగుతాయి. ఈవేడుకలలో ఆర్ఆర్ఆర్ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు ఎన్టీఆర్. అలాగే ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డ్ సొంతం చేసుకుంది.
ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, అడివి శేష్, దుల్కర్ సల్మాన్, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్ చరణ్ పోటీ పడ్డారు. ఇందులో తారక్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఇక ఉత్తమ నటి కేటగిరిలో మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి, సమంత, నిత్యామీనన్, నేహాశెట్టి, శ్రీలీల పోటీ పడగా.. ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది శ్రీలీల. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అవార్డ్ అందుకోగా.. బెస్ట్ సింగర్ గా రామ్ మిర్యాల (డీజే టిల్లు చిత్రానికి) అవార్డ్ అందుకున్నారు.
SIIMA 2023 అవార్డ్స్ విజేతల వివరాలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.