Jack Movie OTT: ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.? రిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన సినిమా జాక్. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందే క్యూరియాసిటీని కలిగించింది.

Jack Movie OTT: ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.? రిలీజ్ ఎప్పుడంటే..
Jack

Updated on: Apr 25, 2025 | 11:19 AM

యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా మారిపోయాడు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయ్యాడు సిద్దు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్‌గా మారిపోయాడు ఈ కుర్ర హీరో.. ఇక డీజే టిల్లు సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. డీజే టిల్లు సినిమా తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. చివరిగా జాక్ కొంచం క్రాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది.

జాక్ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన మూవీకావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జాక్ సినిమాలో సిద్దు తన నటనతో ఆకట్టుకున్నాడు. కాగా జాక్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. జాక్ సినిమాను తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం. మే 1న జాక్ సినిమా ఓటీటీలో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జాక్ సినిమా ఓటీటీ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.