Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు వ్యతిరేఖంగా కొంత మంది కన్నడ తమ్మలు పీకల్‌దాకా కోపం తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోవడమే కాదు .. 4 సంవత్సరాల క్రితం అంటే 2017లో ఈ బ్యూటీ చేసిన ఓ ట్వీటును ఇప్పుడు బయటికి తీసి మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. కన్నడ సినిమాలను.. ఇండస్ట్రీని నీ ట్వీట్‌తో కించపరిచవ్.. సో నీకు కన్నడ సినిమాలో నటించే అర్హత లేదంటూ.. భారీ డైలాగులతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలే సెన్సిటివ్ అయిన శృతి, ఎక్కడ తన ఫెవరెట్ స్టార్ ప్రభాస్ పక్కన, సలార్ సినిమలో.. ఛాన్స్ మిస్సై పోతానోనని .. తెగ బెంగపడి.. అదే ట్విట్టర్ లో ముందు చెప్పిన వివరణ ఇచ్చింది. శృతి స్పందిస్తూ..‘‘కన్నడ చిత్రపరిశ్రమలో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ‘సలార్’ బృందం ఎంతో ప్రత్యేకమైనది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ‘సలార్’ విషయానికి వచ్చేసరికి కథ, పాత్ర నాకెంతో నచ్చింది. అలాగే ఈ చిత్రబృందం నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశాను. అన్ని భాషా చిత్రాల్లో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. 2017లో నేను చేసిన ఓ ట్వీట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ, దర్శక నిర్మాతలు, నటీనటుల పట్ల నాకు గౌరవం ఉంది’’ అని మళ్లీ ట్వీట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :