మ‌రిన్ని జాగ్ర‌త్తల మ‌ధ్య శుక్ర‌వారం నుంచి సీరియ‌ల్ షూటింగ్స్ షురూ..

క‌రోనా వ్యాప్తి, సంబంధిత చ‌ర్య‌ల‌కు సంబంధించి టెలివిజన్ ఇండస్ట్రీ చర్చలు ముగిశాయి. అన్ని విభాగాల‌తో చ‌ర్చించిన అనంత‌రం శుక్రవారం నుండి సీరియల్స్ షూటింగ్ మొదలుపెట్టాల‌ని నిర్ణయించింది టెలివిజన్ నిర్మాతల మండలి.

మ‌రిన్ని జాగ్ర‌త్తల మ‌ధ్య శుక్ర‌వారం నుంచి సీరియ‌ల్ షూటింగ్స్ షురూ..

Edited By:

Updated on: Jun 24, 2020 | 7:46 PM

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో సీరియ‌ల్ షూటింగ్స్ లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి టెలివిజన్ ఇండస్ట్రీ చర్చలు ముగిశాయి. అన్ని విభాగాల‌తో చ‌ర్చించిన అనంత‌రం శుక్రవారం నుండి సీరియల్స్ షూటింగ్ మొదలుపెట్టాల‌ని నిర్ణయించింది టెలివిజన్ నిర్మాతల మండలి. యూనిట్ సభ్యులు అందరి భద్రత కోసం ప్రణాళికలు రూపొందించామ‌ని, నిర్మాతల మండలి నుండి ఒక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుందని..టీవీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు తెలిపారు. యూనిట్లో అందరికి 2లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని…లోకేషన్ లో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీస‌కునే విధంగా ప్ర‌ణాళిక‌లు చేసిన‌ట్టు తెలిపారు.

తాజాగా ఓ నటుడికి కరోనా సోకింది..షూటింగ్ వ‌ల్ల కాద‌ని, ప్రభుత్వ నిబంధనలకు మించి జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని టెలివిజన్ నిర్మాతల మండలి తెలిపింది . ఇటీవ‌ల‌ పాజిటివ్ వచ్చిన నటుడు పనిచేసిన మూడు యూనిట్ల సభ్యులకు టెస్టులు చేయిస్తున్నామ‌ని తెలిపింది. ఇన్సూరెన్స్ వల్ల నిర్మాతకు 20 నుండి 25 లక్షల అదనపు ఖర్చు అవుతుంద‌ని వెల్లడించారు టీవీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. యూనిట్ సభ్యులు భద్రత ముఖ్యం కాబట్టి ఎంత ఖ‌ర్చైన‌ప్ప‌టికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. నిర్మాతకు ఈ సమయంలో సాయం చేయమని చానల్స్ వారిని రిక్వెస్ట్ చేస్తున్న‌ట్లు టెలివిజన్ నిర్మాతల మండలి అధ్యక్షుడు సోనోపిక్స్ ప్రసాద్ వెల్ల‌డించారు.