Adavaallu Meeku Johaarlu: రష్మిక ముందు తెగ సిగ్గుపడిపోతున్న శర్వానంద్.. ఆడవాళ్లు మీకు జోహర్లు నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

నేను… శైలజతో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్‌ తిరుమల. ఆ తర్వాత ‘ఆడవాళ్లూ… మీకు జోహార్లు’ చిత్రాన్ని

Adavaallu Meeku Johaarlu: రష్మిక ముందు తెగ సిగ్గుపడిపోతున్న శర్వానంద్.. ఆడవాళ్లు మీకు జోహర్లు నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

Edited By: Janardhan Veluru

Updated on: Oct 15, 2021 | 3:37 PM

నేను… శైలజతో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్‌ తిరుమల. ఆ తర్వాత ‘ఆడవాళ్లూ… మీకు జోహార్లు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. .. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. ఇక కిశోర్ సినిమాల్లో స్నేహం. . ప్రేమ .. విరహం .. ఇవన్నీ కూడా ఫ్యామిలీ నేపథ్యానికి దగ్గరగా ఉంటాయి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించనంతగా ఆకట్టుకోలేకపోయాడు.. తాజాగా ఆయన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ‘విజయ దశమి’ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.. ఇక దసరా పండుగ నేపథ్యానికి తగినట్టుగా ఆడవాళ్లు మీకు జోహర్లు పోస్టర్ తెగ ఆకట్టుకుంటోంది.

టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో సీనియర్ నటీమణులు.. రాధిక .. ఉర్వశి .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న దసరా కానుకగా శర్వానంద్.. సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో నటించిన మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇందులో అను ఇమాన్యూయేల్…అదితి రావు హీరోయిన్లుగా నటించారు.

ట్వీట్..

Also Read:

IPL 2021 FINAL: ఫైనల్లో రికార్డుల వర్షం.. ధోని సరసన చేరేందుకు రాయుడి ఆరాటం.. 13 ఏళ్ల రికార్డుపై గైక్వాడ్ కన్ను.. లిస్టులో బ్రావో కూడా..!