Sreekaram Pre Release Press Meet: వ్యవసాయ నేపథ్యంలో శర్వానంద్ ‘శ్రీకారం’.. ఈ రోజు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్..

| Edited By: Ravi Kiran

Mar 06, 2021 | 5:50 PM

Sreekaram Pre Release Press Meet: విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్..

Sreekaram Pre Release Press Meet: వ్యవసాయ నేపథ్యంలో శర్వానంద్ శ్రీకారం.. ఈ రోజు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్..
Follow us on

Sreekaram Pre Release Press Meet: విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే సినిమాలను చేయడం శర్వానంద్ స్పెషాలిటీ. ఇక ఇదే ఫార్ములతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం శర్వానంద్.. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా.. ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరోస్ నితిన్, నాని, వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఇక శ్రీకారం ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి శర్వానంద్ మరోసారి హిట్ట్ కోట్టేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇందులోని రావు రమేష్, వీకే నరేష్ లాంటి సీనియర్ నటుల ఎమోషన్స్ హైలేట్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో‌ వ్యవసాయం చేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే సాయి కుమార్ ఇందులో నెగిటివ్ రోల్ చూపించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కి చే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఈనెల శివరాత్రి సందర్బంగా 11న విడుదల చేయనున్నారు. ఇందులో రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, సాయి కుమార్, ఆమని, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‏లో శ్రీకారం ప్రీరీలిజ్ ప్రేస్ మీట్ జరగనుంది. ఈ కార్యాక్రమాన్ని టీవీ9లో లైవ్‏లో విక్షీంచవచ్చు.

Also Read:

Bumper Offer 2 : 12 ఏళ్లతర్వాత సీక్వెల్ కి సిద్దమైన హీరో.. మరోసారి హిట్ కొడతాడా..?

మరోసారి కలిసి నటించబోతున్న రియల్ కపుల్.. గెస్ట్ రోల్‏లో కనిపించనున్న సామ్..

Sreekaram Trailer: భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఈ ‘శ్రీకారం’ చుట్టాల్సిందే.. రైతే రాజు